E-Paper
Advertisement

Maredumilli: హిడ్మా ఎన్‌కౌంటర్ రచ్చ.. మారేడుమిల్లిలో ఓయూ విద్యార్థులు అరెస్ట్

Maredumilli: హిడ్మా ఎన్‌కౌంటర్ రచ్చ.. మారేడుమిల్లిలో ఓయూ విద్యార్థులు అరెస్ట్
Advertisement

Maredumilli: ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన దాదాపు 14 మంది విద్యార్థుల బృందం ఇటీవల అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం పరిధిలో గల మారేడుమిల్లి ప్రాంతానికి చేరుకున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో, దానిపై నిజ నిర్ధారణ చేసే ఉద్దేశంతో విద్యార్థులు ఆ ప్రాంతాలను పరిశీలించడానికి ప్రయత్నించారు.

అల్లూరి జిల్లాలో ఓయూ విద్యార్థులు పోలీస్ స్టేషన్‌కు తరలింపు..
కానీ విద్యార్థులు చింతూరు ప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. చింతూరులో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఆ విద్యార్థుల బృందాన్ని అరెస్టు చేసి, చింతూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు సమయంలో విద్యార్థులు “మావోయిస్టులు మాకొద్దు” అంటూ నినాదాలు చేశారు.

Advertisement

బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు..
అంతేకాకుండా అరెస్టుకు ముందు, విద్యార్థులు బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రయత్నించారు. అయితే, చింతూరు పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం సున్నితమైనది కావడంతో, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

అలాగే ఎన్‌కౌంటర్ ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లిన విశ్వవిద్యాలయాల విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా నిర్బంధించడం సరికాదని విద్యార్థి సంఘాలు, ఇతర పౌర సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

Advertisement

నిజనిర్ధారణకు వెళ్లిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం నేరం..
ఈ రోజు (శుక్రవారం) ఉదయం 8 గంటల సమయంలో విద్యార్థుల బృందాన్ని అరెస్టు చేసి, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. రాజ్యాంగబద్ధంగా నిజనిర్ధారణకు వెళ్లిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామికం అని విమర్శించారు.

Also Read: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్! నెల్లూరులో దంచికొడుతున్న వర్షాలు.. వేలాది ఎకరాల్లో పంట నష్టం.. 

అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్..
అరెస్టు చేసిన విద్యార్థులను పోలీసులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, నిజనిర్ధారణ చేసుకోవడానికి విద్యార్థులకు అవకాశం కల్పించాలని కూడా వారు కోరారు. ఎన్‌కౌంటర్ ఘటనపై వాస్తవాలను తెలుసుకునే హక్కు పౌర సమాజానికి, విద్యార్థులకు ఉందని వారు వాదిస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×