E-Paper
Advertisement

Travis Head: తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా కొట్టిన హెడ్.. వీడికి ఎప్పుడు మగాళ్లపైన పిచ్చి

Travis Head: తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై దారుణంగా కొట్టిన హెడ్.. వీడికి ఎప్పుడు మగాళ్లపైన పిచ్చి
Advertisement

Travis Head: ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం యాషెస్ సిరీస్ {2025 – 26} జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఇప్పటికే మొదటి టెస్ట్ పూర్తయింది. ఇక రెండోవ టెస్ట్ గురువారం నుండి బ్రిస్ బెన్ వేదికగా జరుగుతుంది. ఈ రెండవ టెస్ట్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ ప్రారంభించింది.

Also Read: Ravi Shastri: కోహ్లీ, రోహిత్‌ల జోలికి రావొద్దు… గంభీర్ కు హెచ్చరిక

Advertisement

అయితే తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్ సెంచరీ {135*} తో మెరిశాడు. ఇక ఓపెనర్ జాక్ క్రాలీ {76} ఆఫ్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్.. ఇంగ్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లోనే ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు.

 

తోటి ప్లేయర్ ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టిన హెడ్:

Advertisement

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావీస్ హెడ్ మైదానంలో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హెడ్ అంటే కేవలం హార్డ్ హిట్టర్ మాత్రమే కాదు.. మైదానంలో పూర్తి ఎంటర్టైనర్ కూడా. ఫీల్డింగ్ లో ఉన్నప్పుడు హెడ్ హాస్యంగా ఇచ్చే రియాక్షన్స్, అప్పుడప్పుడు అంపైర్ తో చేసే ఫన్నీ డిస్కషన్, వికెట్ పడిన సందర్భాలలో స్పెషల్ సెలబ్రేషన్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సందర్భంగా హెడ్ చేసిన ఓ పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెకండ్ సెషన్ ప్రారంభం అయ్యే సమయంలో, ఆస్ట్రేలియా ఆటగాళ్లంతా మైదానంలోకి వెళ్లే సందర్భంలో.. ట్రావీస్ హెడ్ ఓ చిలిపి పనిచేశాడు. తన పక్కన ఉన్న సహచర ఆటగాడి ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ వెళ్ళాడు. దీంతో ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోకి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నేటిజెన్లు. మరోసారి బాల్ ట్యాంపరింగ్ జరిగిందంటూ తెగ నవ్వుకుంటున్నారు.

 

అరుదైన ఘనత సాధించిన ట్రావీస్ హెడ్:

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ట్రావీస్ హెడ్ అరుదైన ఘనత సాధించాడు. అతి తక్కువ బంతుల్లోనే 50 పరుగుల మార్క్ అందుకున్న బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. తొలి టెస్ట్ లో టాస్ ఓడిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ చేసింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 172 పరుగులకే ఆల్ అవుట్ అయింది. అనంతరం ఇంగ్లాండ్ బౌలర్లు కూడా ఆస్ట్రేలియాని 132 పరుగులకే కట్టడి చేశారు. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్ లో 40 పరుగుల ఆదిక్యం సాధించింది ఇంగ్లాండ్.

Also Read: Rohit Sharma: రిటైర్మెంట్ వెన‌క్కి.. టీ-20ల్లోకి వ‌చ్చేస్తున్న రోహిత్ శ‌ర్మ‌..?

ఇక రెండవ ఇన్నింగ్స్ లో 164 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. దీంతో ఆస్ట్రేలియా టార్గెట్ 205 గా మారింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఓపెనర్ గా వచ్చిన హెడ్.. ఇంగ్లాండ్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు. కేవలం 36 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో యాషేష్ సిరీస్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన ఐదవ బ్యాటర్ గా నిలిచాడు. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించిన హెడ్.. 69 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 83 బంతుల్లో 123 పరుగులు చేశాడు. ఈ విధ్వంసకర బ్యాటింగ్ సాయంతో ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 205 పరుగులు చేసి.. రెండవ రోజే మ్యాచ్ ని ముగించింది.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">

 

View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Luke W (@luke_wolstenholme)

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×