E-Paper
Advertisement

Pawan Kalyan : ఆ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా?.. వాలంటీర్లపై మరోసారి పవన్ కామెంట్స్..

Pawan Kalyan : ఆ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా?.. వాలంటీర్లపై మరోసారి పవన్ కామెంట్స్..
Advertisement

Pawan kalyan latest comments(AP politics) : జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. తమపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ వాలంటీర్లు నిరసనకు దిగారు. పవన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అటు మంత్రులు జనసేనానిపై ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏలూరు నియోజకవర్గ నేతలు, వీర మహిళలతో భేటీ అయిన పవన్.. తనపై వైసీపీ నేతల ఎదురుదాడి చేయడాన్ని తప్పుపట్టారు. తన వ్యాఖ్యలకు సమాధానం చెప్పలేకే అలా చేస్తున్నారని మండిపడ్డారు.

ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వాలంటీర్ల వేతనాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. వాలంటీర్‌ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం వాలంటీర్ల వద్ద ఉందన్నారు. ఆ సమాచారాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు.సేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్లు, ప్రజలపై దాడులు చేస్తారా? అని నిలదీశారు.

Advertisement

మహిళల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించరు? అని జనసేనాని నిలదీశారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిప్డడారు. వైసీపీ నాయకులు తనపై చేసే వ్యాఖ్యలకు తన భార్య కూడా ఏడుస్తోందని పవన్‌ తెలిపారు.

రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎవరో పెట్టిన పార్టీని వైసీపీ వాళ్లు తీసుకున్నారని విమర్శించారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ వైసీపీ అని అన్నారు. తనను బెదిరించారని, డబ్బుతో మభ్యపెట్టాలని చూశారని పవన్ చెప్పుకొచ్చారు. జగన్‌ అంటే తనకు కోపం లేదని వైసీపీ ప్రభుత్వ విధానాలనే వ్యతిరేకిస్తున్నాయని స్పష్టం చేశారు. నాయకులు చేసిన తప్పులు ప్రజలపై ప్రభావం చూపిస్తాయన్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×