E-Paper
Advertisement

Biryani Sales: న్యూఇయర్ వేళ.. కేవలం ఐదు గంటల్లో రూ. 6 కోట్ల బిర్యానీ సేల్స్, ఇంతకీ ఎక్కడో తెలుసా?

Biryani Sales: న్యూఇయర్ వేళ..  కేవలం ఐదు గంటల్లో రూ. 6 కోట్ల బిర్యానీ సేల్స్, ఇంతకీ ఎక్కడో తెలుసా?
Advertisement

Biryani Sales: న్యూ ఇయర్ ముందు.. ఆ తర్వాత సెలబ్రేషన్స్ మజాయే వేరు. ఒక్కొక్కరు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుంటారు. సెలబ్రేషన్స్ విషయంలో ఒక్కసారి కమిటయితే ఏ ఒక్కరూ వెనక్కి తగ్గరు. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కి ఐదు గంటల ముందు 6 కోట్ల రూపాయలు విలువ చేసే బిర్యానీని అమ్ముడు పోయింది. ఇదొక రికార్డుగా చెబుతున్నారు. ఇంతకీ ఎక్కడో తెలుసా?

న్యూఇయర్ వేళ..  బాపట్ల జిల్లా కొత్త రికార్డు

Advertisement

న్యూ ఇయర్.. ఈ పేరు గురించి చెప్పనక్కర్లేదు. ఆ రోజు కోసం చాలామంది వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. కొత్త సంవత్సరం ముందు రోజు రాత్రి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. కొందరైతే తమ బంధువులను ప్రత్యేకంగా పిలుస్తుంటారు కూడా. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పాత ఏడాదికి వీడ్కోలు చెబుతారు. ఏపీలోని బాపట్ల జిల్లాలో బుధవారం రాత్రి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఇంతకీ బాపట్ల జిల్లా విశేషం ఏంటో తెలుసా? అక్కడికే వచ్చేద్దాం.

బాపట్ల జిల్లాలో న్యూఇయర్ సెలబ్రేషన్స్ ధూమ్ ధామ్‌గా జరిగాయి.  ఈ విషయంలో ఆ జిల్లా ప్రజలు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.  బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు దాదాపు 6 కోట్ల బిర్యానీ అమ్ముడు పోయినట్టు వ్యాపార వర్గాలు చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ రేంజ్‌లో బిర్యానీ ఆర్డర్లు ఇచ్చిందెవరంటూ చర్చించుకోవడం మొదలైంది.

Advertisement

కేవలం ఐదు గంటల్లో ఆరు కోట్ల బిర్యానీలు సేల్స్

బాపట్ల జిల్లా జనాభా మొత్తం 12.75 లక్షల మంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో ప్రతి ఇద్దరిలో ఒకరు బిర్యానీ రుచి చూసినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 6 లక్షల మంది బిర్యానీ కొనుగోలు చేసినట్లు చెబుతున్నాయి. బిర్యానీ సగటు ధర రూ.100 లెక్కలోకి తీసుకున్నా దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

బిర్యానీ కాకుండా కేకులు, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ప్రత్యేక విందులు, పార్టీ హాల్స్ వంటివి అదనం. ఈ లెక్కన న్యూ ఇయర్ ఏమోగానీ.. ఆ ఐదు గంటలు బిర్యానీ సెంటర్లు వినియోగదారులతో కిటకిటలాడాయని చెప్పవచ్చు.  మొత్తానికి ఈసారి న్యూఇయర్ వేళ బాపట్ల జిల్లా బిర్యానీ సేల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

ALSO READ:  న్యూఇయర్ వేళ.. రెండు వర్గాల యువకుల మధ్య ఫైటింగ్

నార్మల్‌గా ఇలాంటి సెలబ్రేషన్స్ వేళ మెట్రోపాలిటన్ సిటీలు, టైర్ టూ సిటీలు బిర్యానీ సేల్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. అలాంటిది బాపట్ల తొలిసారి ఆ క్రెడిట్ దక్కించుకుంది. మరి మెట్రో సిటీల బిర్యానీల సేల్స్ గురించి తెలియాలంటే కొద్ది గంటలు ఆగాల్సిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×