E-Paper
Advertisement

Spirit: ప్రభాస్ ఫస్ట్ లుక్.. కాపీ అంటూ భారీ ట్రోల్స్!

Spirit: ప్రభాస్ ఫస్ట్ లుక్.. కాపీ అంటూ భారీ ట్రోల్స్!
Advertisement

Spirit:రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. ఇప్పటికే వరుస చిత్రాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.అయితే ప్రభాస్ నటిస్తున్న చిత్రాలలో మిగతా సినిమాలు ఒక ఎత్తైతే.. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా మరో ఎత్తు అని చెప్పాలి. నిజానికి సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ఏ రేంజ్ లో సంచలనం సృష్టించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఈయన దర్శకత్వంలో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోతున్నారు అని తెలిసినప్పటి నుంచి ఆయన ఫస్ట్ లుక్ పై, స్టోరీ పై అభిమానులలో ప్రత్యేకమైన అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇక అందుకు తగ్గట్టుగానే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్

స్పిరిట్ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్..

ఈ సినిమా షూటింగ్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా ప్రారంభం అయింది.అయితే ఈ సినిమా నుండి ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు చిత్ర బృందం రిలీజ్ చేసింది. సన్నబడిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్.. ఒంటి నిండా గాయాలతో ఒక చేతిలో మందు సీసా.. మరొకవైపు ఒక యువతి సిగరెట్ వెలిగిస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నిజానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. ఇది కాపీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. అంతేకాదు ఆధారాలతో సహా సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

Advertisement

ALSO READ:Champion: ఛాంపియన్ లో పాన్ ఇండియా స్టార్ మేనమామ.. ఎవరంటే?

ఆ సినిమాతో పోలుస్తూ కాపీ ట్రోల్స్..

అసలు విషయంలోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన అతిధి సినిమాలోని ఒక పిక్ తో ప్రభాస్ స్పిరిట్ ఫస్ట్ లుక్ ని పోలుస్తూ పోస్ట్లు పెడుతున్నారు. అంతేకాదు సందీప్ రెడ్డి వంగ కూడా కాపీ కొడతాడా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ పోస్టర్ పై వస్తున్న ట్రోల్స్ కి చిత్ర బృందం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. మొత్తానికి అయితే ఎన్నో అంచనాల మధ్య న్యూ ఇయర్ సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ మొదటి రోజే ఇలా విమర్శలు ఎదుర్కోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రభాస్ సినిమాలు..

Advertisement

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా చేస్తున్నారు. జనవరి 9వ తేదీన సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది..ఇందులో నిధి అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అంతేకాదు మాళవిక తొలిసారి తెలుగు సినీ రంగ ప్రవేశం చేస్తోంది. మారుతీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు ప్రేక్షకులకు సినిమాపై అంచనాలు పెంచేలా చేశాయి. ఈ సినిమాతో పాటు స్పిరిట్ , కల్కి2, సలార్ 2 వంటి చిత్రాలలో ప్రభాస్ నటిస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×