E-Paper
Advertisement

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్.. బడ్జెట్, ప్రత్యేకతలు ఇవే!

ఢిల్లీలో కొత్త ఏపీ భవన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్.. బడ్జెట్, ప్రత్యేకతలు ఇవే!
Advertisement

AP Bhavan: దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర పరిపాలనా, ఆతిథ్య కేంద్రంగా కొత్త ఏపీ భవన్‌ నిర్మాణం జరగనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థతో సర్కారు ఒప్పందం కుదుర్చుకుంది. అత్యాధునిక సౌకర్యాలు, సమకాలీన శిల్పకళను ప్రతిబింబించేలా బిల్డింగ్ నిర్మించనున్నారు.

కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు లైన్ క్లియర్

Advertisement

ఢిల్లీలో ఏపీ భవన్ కోసం కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముందడుగు పడింది. ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన NBCCకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 105 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, NBCC మధ్య ఒప్పందం కుదిరింది. దాదాపు 2లక్షల 49వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త భవన సముదాయాన్ని నిర్మిస్తారు. ప్లానింగ్, వాస్తు, ఆర్కిటెక్చరల్ డిజైన్ల తయారీ, టెండరింగ్, కాంట్రాక్ట్ నిర్వహణతో పాటు నిర్మాణ పనులన్నింటినీ టర్న్‌కీ పద్ధతిలో NBCC స్వయంగా పర్యవేక్షించనుంది. భవనం నిర్మాణం పూర్తైన తర్వాత కనీసం ఐదేళ్ల పాటు దాని నిర్వహణ బాధ్యతలను NBCCనే చూసుకోనుంది.

Also Read: విజయవాడ లాకప్‌డెత్ కేసులో బిగ్‌ ట్విస్ట్‌.. సీఐ నాగరాజు 18 పేజీల లేఖలో ఏముంది?

Advertisement

ప్రతిష్టాత్మక యూనివర్సిటీ క్యాంపస్

ప్రభుత్వ రంగ నిర్మాణ దిగ్గజం ఎన్బీసీసీ ఇండియా లిమిటెడ్ జైత్రయాత్ర మార్కెట్‌లోనూ కొనసాగుతోంది. కేవలం ప్రస్తుత 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే (Q1) ఈ సంస్థ ఏకంగా రూ.955.13 కోట్ల విలువైన కొత్త నిర్మాణ కాంట్రాక్టులను సొంతం చేసుకుంది. ఇందులో ఒక ప్రతిష్టాత్మక యూనివర్సిటీ క్యాంపస్, మోడ్రన్ టౌన్‌షిప్ నిర్మాణాలు కూడా ఉన్నాయి. ఈ మైలురాయి వివరాలను సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అధికారికంగా సమర్పించింది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా, అత్యాధునిక వసతులతో భవనాన్ని నిర్మించనున్నారు. రానున్న రోజుల్లో ఏపీకి సంబంధించిన కీలక పరిపాలన, దౌత్య వ్యవహారాలకు కొత్త ఏపీ భవన్ వేదిక కానుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×