E-Paper
Advertisement

స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే అస్సలు కొనకండి!

స్మార్ట్ టీవీ కొంటున్నారా? ఈ విషయాలు తెలియకపోతే అస్సలు కొనకండి!
Advertisement

Smart tv buying guide 2026: ఒకప్పుడు టీవీ అంటే కేవలం కేబుల్ ఛానల్స్ చూసే ఒక డబ్బా. కానీ ఇప్పుడు కాలం మారింది. టీవీలు కూడా ‘స్మార్ట్’ అయిపోయాయి! కేవలం రిమోట్ బటన్ నొక్కితే చాలు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోస్ అంటూ వినోదాల ప్రపంచం మన కళ్లముందు సాక్షాత్కరిస్తుంది. అయితే మార్కెట్లో రకరకాల స్క్రీన్ సైజులు, డిస్‌ప్లే టెక్నాలజీలు ఉండటంతో ఏ స్మార్ట్ టీవీ కొనాలో చాలా మందికి అర్థం కావడం లేదు. అందుకే,స్మార్ట్ టీవీల గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

స్మార్ట్ టీవీ.. కొనేముందు ఇవి చూసుకోండి!

1. ఆపరేటింగ్ సిస్టమ్ :
మనం ఫోన్లలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ వాడినట్లే స్మార్ట్ టీవీలకు కూడా ఓఎస్ ఉంటుంది.

Advertisement

గూగుల్ టీవీ /ఆండ్రాయిడ్ టీవీ (Google/Android TV): ప్రస్తుతం ఇవే మోస్ట్ పాపులర్. ఇందులో గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది కాబట్టి వేల కొద్దీ యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాడుక కూడా చాలా ఈజీగా ఉంటుంది.

వెబ్ ఓఎస్ & టైజెన్ (WebOS & Tizen): ఎల్‌జీ టీవీల్లో వెబ్ ఓఎస్, శామ్‌సంగ్ టీవీల్లో టైజెన్ ఓఎస్ ఉంటాయి. ఇవి చాలా స్మూత్‌గా రన్ అవుతాయి. అంతే కాకుండా ప్రీమియం ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయి.

Advertisement

2. డిస్‌ప్లే ,రిజల్యూషన్:
టీవీలో మనకు పిక్చర్ క్వాలిటీ ఎంత బాగుంటే.. అంత ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి.

LED/QLED/OLED: బడ్జెట్ రేంజ్‌లో నార్మల్ LED టీవీలు వస్తాయి. కొంచెం కలర్స్, బ్రైట్‌నెస్ ఎక్కువ కావాలనుకుంటే QLED బెస్ట్. ఇక బడ్జెట్ అస్సలు సమస్య కాదు, రియలిస్టిక్ కలర్స్, ప్యూర్ బ్లాక్ కావాలనుకుంటే.. OLED టీవీలకు వెళ్ళిపోవచ్చు.

రిజల్యూషన్: చిన్న టీవీలు (32 ఇంచులు) సాధారణంగా HD Ready తో వస్తాయి. 43 ఇంచుల సైజులో Full HD లేదా 4K దొరుకుతాయి. 55 ఇంచులు అంతకంటే.. ఎక్కువ సైజ్ కొనేటప్పుడు ఖచ్చితంగా 4K Ultra HD ఉండేలా చూసుకోండి.

3. కనెక్టివిటీ, సౌండ్:
టీవీకి కనీసం 2 లేదా 3 HDMI పోర్టులు, 2 USB పోర్టులు ఉండటం చాలా ముఖ్యం. దీని వల్ల సెట్-టాప్ బాక్స్, హోమ్ థియేటర్, గేమింగ్ కన్సోల్‌లను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై , బ్లూటూత్ సపోర్ట్ తప్పనిసరి. ఆడియో విషయానికి వస్తే, కనీసం 20W నుంచి 30W అవుట్‌పుట్ ఇచ్చే Dolby Atmos లేదా Dolby Audio సపోర్ట్ ఉన్న టీవీలను ఎంచుకుంటే థియేటర్ లాంటి సౌండ్ వస్తుంది.

4. బడ్జెట్ ,ధరల వివరాలు:
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ టీవీల ధరలు అందరికీ అందుబాటులో ఉన్నాయి.

బడ్జెట్ టీవీలు (రూ.12,000 -రూ.20,000): ఈ రేంజ్‌లో మీకు 32 ఇంచుల నుంచి 43 ఇంచుల వరకు మంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు లభిస్తాయి. షియోమీ (Mi), రియల్‌మి, వన్‌ప్లస్, ఇన్ఫినిక్స్ వంటి బ్రాండ్లు ఈ కేటగిరీలో బెస్ట్ ఆప్షన్స్.

మిడ్-రేంజ్ టీవీలు (రూ.25,000 – రూ.45,000): ఇందులో అద్భుతమైన 43 ఇంచుల లేదా 55 ఇంచుల 4K అల్ట్రా హెచ్‌డీ టీవీలు వస్తాయి. ఇందులో ప్యానసోనిక్, టిసిఎల్ (TCL), ఏసర్ (Acer) వంటి బ్రాండ్లు మంచి ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి.

ప్రీమియం టీవీలు (రూ.50,000 పైన): సోనీ , శామ్‌సంగ్ , ఎల్‌జీ బ్రాండ్లు ఈ రేంజ్‌లో టాప్. వీరి డిస్‌ప్లే టెక్నాలజీ, లైఫ్ టైమ్ , సర్వీస్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి.

స్మార్ట్ టీవీ కొనేటప్పుడు బ్రాండ్ పేరు మాత్రమే కాకుండా.. స్క్రీన్ సైజ్, రూమ్ సైజుకు సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే ఎక్కువ ఫీచర్లు ఇచ్చే బ్రాండ్లను, లాంగ్ రన్ కావాలనుకుంటే కాస్త బడ్జెట్ పెంచి టాప్ బ్రాండ్లను ఎంచుకోవడం ఎల్లప్పుడూ స్మార్ట్ ఛాయిస్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×