E-Paper
Advertisement

Shiva Temple: బాలుడి కలలో శివుడి దర్శనం.. నాగుపాము పుట్టలో శివలింగం

Shiva Temple: బాలుడి కలలో శివుడి దర్శనం.. నాగుపాము పుట్టలో శివలింగం
Advertisement

Shiva Temple: మూడు నెలలుగా ఆ బాలుడికి కలలో శివుడు కనిపిస్తున్నాడు. గ్రామానికి సమీపంలోని ఓ ప్రాంతంలో ఉన్న పుట్టలో తాను కొలువై ఉన్నానని, తీసుకొచ్చి పూజలు చేయాలని కలలో శివుడు చెప్తున్నాడని ఓ బాలుడు గ్రామస్థులతో చెప్పాడు. అయితే గ్రామస్థులు బాలుడి మాటలు పట్టించుకోలేదు. చివరకు కొందరు వ్యక్తులతో కలిసి గ్రామ సమీపంలోని పుట్ట వద్దకు వెళ్లాడు. అక్కడ నాగు పాము కనిపించడంతో వెనక్కి వచ్చేశాడు. ఆ మరుసటి రోజు మళ్లీ వెళ్లి పుట్టను తవ్వగా.. అక్కడ శివ లింగం ఆకృతిలో ఉన్న శిల్పం దొరికింది. ఆ శివ లింగాన్ని తన ఇంటికి తీసుకొచ్చాడు బాలుడు. ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో శివ లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఈ ఉదంతం నెల్లూరు జిల్లాలో జరిగింది.

బాలుడి కలలో శివుడు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పులికల్లు గ్రామంలోని ఎస్టీ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీకి చెందిన నాగేంద్ర అనే బాలుడికి గత మూడు నెలలుగా శివుడు కలలో కనిపిస్తున్నాడని చెప్తున్నాడు. తాను పలానా చోట పుట్టలో ఉన్నానని శివుడు తన కలలో చెప్పాడని బాలుడు గ్రామస్థులతో అంటున్నాడు. అయితే బాలుడు చెప్పిన విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఎవరూ నమ్మలేదు. ఈ నేపథ్యంలో 10 రోజుల క్రితం ఒకరిద్దరు గ్రామస్థులను ఒప్పించి గ్రామానికి 3 కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న పుట్ట వద్దకు తీసుకెళ్లాడు బాలుడు. అయితే ఆ పుట్ట వద్ద పాము కనిపించడంతో భయపడి వెనక్కి వచ్చేశారు.

Advertisement

పుట్టలో శివలింగం

తిరిగి మళ్లీ సోమవారం వారు పుట్ట వద్దకు వెళ్లి, పుట్టను తవ్వగా అందులో శివలింగం కనిపించింది. దానిని పులికల్లు ఎస్టీ కాలనీకి తీసుకొచ్చారు. తన ఇంటి సమీపంలోని ఖాళీ స్థలంలో మూడు వైపులా సిమెంట్ ఇటుకలు పేర్చి, పైన సిమెంట్ అచ్చు ఉంచి చిన్న నిర్మాణాన్ని సిద్ధం చేశాడు. దానినే గుడి భావించి అందులో శివ లింగాన్ని ఉంచాడు. తనకు వచ్చిన విధంగా పూజలు చేశాడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి విగ్రహాన్ని చూడడానికి పలువురు భక్తులు వస్తున్నారు. విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. బాలుడి భక్తి శ్రద్ధలను అభినందిస్తున్నారు.

Advertisement

Also Read: PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×