E-Paper
Advertisement

TDP VS YCP AI War: బాబు ఏడుపు.. రోడ్డుపై జగన్‌.. ఏపీలో AI రాజకీయం

TDP VS YCP AI War: బాబు ఏడుపు.. రోడ్డుపై జగన్‌.. ఏపీలో AI రాజకీయం
Advertisement

TDP VS YCP AI War: మాములుగా రాజకీయాలు వేరు.. ఇందులో ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రశంసలైనా.. విమర్శలైనా.. తిట్లైనా.. ఆరోపణలైనా.. చాల ట్రెండిగా చేస్తారు. ఇప్పుడు లెటెస్ట్‌ టెక్నాలజీని వాడి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఇందులో ఒక ఏఐ వీడియో చేసింది టీడీపీ.. మరో ఏఐ వీడియో చేసింది వైసీపీ.. ఏ వీడియో ఎవరు చేశారో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. అయితే ఇప్పుడీ వీడియోలపై కూడా రాజకీయం మొదలైంది. టీడీపీ నేతలు చేసిన ఏఐ వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇలాంటి వీడియోలు చేయవద్దని.. మనం రాజకీయంగా శత్రువులమే కావొచ్చు కానీ వ్యక్తిగతంగా ఇలా కించపరుచుకోవద్దు అంటూ పోస్ట్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఏ వీడియోను అయితే తప్పు పట్టారో.. అదే వీడియోను మళ్లీ షేర్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో మరింత వైరల్‌గా మారింది.

Advertisement

మరి టీడీపీ ఇంత చేస్తే.. వైసీపీ నేతలు ఊరుకుంటారా. వారు కూడా సేమ్ లోకేష్‌ స్టైల్‌లోనే ఈ వీడియోను ట్యాగ్‌ చేసి.. సేమ్‌ లోకేష్‌ ఏదైతే కంటెంట్ రాశారో దానినే రీపిట్ చేశారు.

మొత్తానికి ఇరు పార్టీల నేతలు సుమతీ శతకాలు చెబుతున్నట్టు పైకి కనిపిస్తున్నా.. అంతర్గతంగా కత్తులు దూసుకుంటున్నట్టు క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది. దీనికి ఇప్పుడు లెటెస్ట్‌ టెక్నాలజీని వాడుకోవడం అనేది ఇప్పుడు కొత్త విషయం.

Advertisement

ఈ సందర్భంలో రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత విమర్శలు, కించపరిచే వీడియోలు రాజకీయ సంస్కృతిని దిగజారుస్తాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టెక్నాలజీని అభివృద్ధి, అవగాహన, ప్రజాసేవ కోసం వినియోగిస్తే మంచిదే గానీ, అవమానాలు, అపప్రచారాల కోసం ఉపయోగించడం సమాజానికి మంచిది కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

 Also Read: వరాలు ఇవ్వడానికి నేను సీఎం కాదు.. కొబ్బరి రైతులతో పవన్‌కల్యాణ్

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఏఐ వీడియోలు మరో ఆయుధంగా మారాయి. ఇది భవిష్యత్తులో ఎంతవరకు వెళ్తుందో, ఈ డిజిటల్ రాజకీయ యుద్ధం ప్రజాస్వామ్యాన్ని ఏ దిశగా తీసుకెళ్లబోతుందో వేచి చూడాల్సిందే.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×