E-Paper
Advertisement

MBBS Seats Increase: మెడికల్ విద్యార్థులకు తీపి కబురు.. 100 ఎంబీబీఎస్ సీట్లు పెంపు, సీట్లు ఓకే సౌకర్యాల మాటేంటి?

MBBS Seats Increase: మెడికల్ విద్యార్థులకు తీపి కబురు..  100 ఎంబీబీఎస్ సీట్లు పెంపు, సీట్లు ఓకే సౌకర్యాల మాటేంటి?
Advertisement

MBBS Seats: ఏపీలో వైద్యా విద్యార్థులకు తీపి కబురు వచ్చేసింది. ఈ ఏడాది నుంచి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్వయంగా ప్రకటన చేశారు. కౌన్సెలింగ్‌కు ముందు సీట్లు పెంపుతో విద్యార్థులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు.

ఏపీలో మెడికల్ విద్యార్థులకు శుభవార్త-ఏపీలో వైద్యా విద్యార్థులకు తీపి కబురు వచ్చేసింది. ఈ ఏడాది నుంచి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్లు పెరగనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్వయంగా ప్రకటన చేశారు. కౌన్సెలింగ్‌కు ముందు సీట్లు పెంపుతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

100 ఎంబీబీఎస్ సీట్లు పెంపు-ఏపీలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త చెప్పింది జాతీయ వైద్య కమిషన్-ఎన్‌ఎంసీ.  2026-27 విద్యా ఏడాది నుంచి అదనంగా 100 ఎంబీబీఎస్ సీట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో విద్యార్థులు ఫుల్‌ఖుషీ. పెంచిన సీట్లు కడప ప్రభుత్వ వైద్య కళాశాల-75 సీట్లు, నెల్లూరు ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల- 25 సీట్ల పెరగనున్నాయి.

కడప-నెల్లూరు జిల్లాల కాలేజీలకు అదనపు సీట్లు-ఈ మేరకు ఎన్‌ఎంసీ లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేసింది. ఇదే విషయాన్ని ఏపీ వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడించారు. తాజాగా ఎన్‌ఎంసీ ఆమోదంతో కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 175 నుండి 250కి పెరిగింది. నెల్లూరు ఏసీఎస్ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ సంఖ్య 175 నుండి 200కి పెరిగింది.

Advertisement

సీట్ల పెంపు రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు అవకాశాలు కల్పించడం, ఏపీ ఆరోగ్య సంరక్షణ విద్యా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయనుంది. నాణ్యమైన వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావడానికి శిక్షణ పొందిన ఆరోగ్య సంరక్షణ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి నిరంతర చేస్తున్న ప్రయత్నాలకు అదనపు సీట్లు పెంపు ఓ నిదర్శనమని మంత్రి చెప్పారు.

ALSO READ: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ముంబయిలో విజయవంతంగా శస్త్ర చికిత్స

ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల స్థానిక విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించే సువర్ణావకాశం లభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లో గణనీయమైన మెరుగుదల వల్లే ఎన్‌ఎంసి ఆమోదం లభించిందని వైద్య విద్యా డైరెక్టర్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు.

మౌలిక సదుపాయాల పెంపు, అర్హత గల బోధనా సిబ్బంది నియామకం, ఎన్‌ఎంసి నిర్దేశించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించడం వల్లే అదనపు సీట్లను పొందగలిగాయని అన్నారు. ఈ మైలురాయిని సాధించడంలో సమిష్టిగా కృషి చేసిన కడప-నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాల్‌లు, వైద్య సిబ్బందిని అభినందించారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×