E-Paper
Advertisement

Nara Bhuvaneshwari: మాకు ఇంకా ముప్పు ఉంది.. ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు

Nara Bhuvaneshwari: మాకు ఇంకా ముప్పు ఉంది.. ఫోన్ చేసి బెదిరిస్తున్నారు.. నారా భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Nara Bhuvaneshwari: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం పర్యటనలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగడం, అవరోధాలను అధిగమించడం వంటి అంశాలపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అయితే, ఈ క్రమంలోనే ఆమె తమ కుటుంబ భద్రతపై, గత జ్ఞాపకాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజల కోసమే తమ కుటుంబం ఉందని, ప్రజాసేవ కోసం తాము ఎన్నో త్యాగాలు చేశామని ఆమె ఉద్ఘాటించారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను భువనేశ్వరి ఈ వేదికపై గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమండ్రి జైలులో నిర్బంధించిన ఘటన తమ జీవితంలో మర్చిపోలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గడ్డు కాలంలో ప్రజలు తమకు అండగా నిలిచారని, జైలు వద్దకు తరలివచ్చిన ప్రజాభిమానమే తమ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని ఆమె భావోద్వేగంతో పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన కష్టాన్ని ప్రజలు మర్చిపోలేదని, అందుకే ఆయన కోసం అంతలా పోరాడారని ఆమె తెలిపారు. “మేము త్యాగాలు చేస్తూనే ఉన్నాం.. అనేక బెదిరింపులను ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ మాకు ముప్పు ఉంది. బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి” అని భువనేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో తమ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, తమకు ఇంకా రక్షణ లేదన్న రీతిలో ఆమె మాట్లాడటం అందరినీ విస్మయానికి గురిచేసింది.  రాష్ట్రానికి ముఖ్యమంత్రి భార్య అయి ఉండి, కేంద్రంలో కూడా ప్రభావం చూపగలిగే స్థాయిలో ఉండి కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్నది టీడీపీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? ఈ బెదిరింపుల వెనుక ఉన్నదెవరు? అనే కోణంలో పార్టీ శ్రేణులు చర్చిస్తున్నాయి.

Read Also: Maoist Encounter: ఏపీలో హిడ్మాకి ఏం పని.. పోలీసుల ట్రాప్‌లో ఎలా పడ్డాడు?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×