E-Paper
Advertisement

Nagababu: మాజీ సీఎం జగన్‌ని తొలిసారి ఏకేసిన నాగబాబు.. అన్నికోణాల్లో కూడా, పాయింట్ టు పాయింట్

Nagababu: మాజీ సీఎం జగన్‌ని తొలిసారి ఏకేసిన నాగబాబు.. అన్నికోణాల్లో కూడా, పాయింట్ టు పాయింట్
Advertisement

Nagababu: ఏపీలో రాజకీయాలు తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి. సీబీఐ సిట్ దాఖలు చేసిన వ్యవహారంపై అధికార కూటమి-విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంపై తొలిసారి రియాక్ట్ అయ్యారు జనసేన ఎమ్మెల్సీ నాగబాబు. దాదాపు ఆరున్నర నిమిషాల వీడియోలో వైసీపీని అన్నికోణాల్లో ఏకి పారేశారు.

మాజీ సీఎం జగన్‌ని తొలిసారి ఏకేసిన నాగబాబు

Advertisement

ఏపీలో రాజకీయాలు తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై సీబీఐ సిట్ ఛార్జిషీటు, ఆపై ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం వంటి పరిణామాలు జరుగుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీనిపై సామాన్యుడి నుంచి ఉన్నత స్థాయి వరకు చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పారు. జనసేన ఎమ్మెల్సీ నాగబాబు.

అంతేకాదు వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు, ప్రతిపక్షంలో ఆ పార్టీ చేస్తున్న రాజకీయాలను ఎండగట్టారు. తానేమీ నాస్తికుడిని కాదంటూ నాగబాబు నాలుగు మాటలు చెప్పారు. 2020 ఏడాదిలో అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి రధం దగ్గమైన రోజు నుంచి మాట్లాడారు నాగబాబు.

Advertisement

అన్నికోణాల్లో కూడా, పాయింట్ టు పాయింట్

దీనిపై ఎందుకు వైసీపీ నేతలు మాట్లాడలేదని ప్రశ్నించారు. వ్యక్తుల జీవితాల మీద ఉండే ఆసక్తి.. హిందూ దేవాలయాలపై ఎందుకు ఉంటుందన్నారు. ఆ తర్వాత రామతీర్థం ఘటన గురించి ప్రస్తావించారు. జగన్, ఆయన మంత్రులకు రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద శ్రద్ధ రాముడి మీద ఎందుకుంటున్నారు.

అలాగే అయోధ్య రామమందిరం గురించి నోరు విప్పారు. ఏపీ నుంచి ప్రభుత్వ పెద్దలు వెళ్లారని గుర్తు చేశారు. హిందువులపై ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్న వైసీపీ, కనీసం ఒక్క ట్వీట్ గానీ, వీడియోగానీ బయటపెట్టారా? అంటూ సూటిగా లేవనెత్తారు. కనీసం మీ స్టాండ్ ఏంటో కనీసం ప్రజలకు చెప్పే దమ్ము ఉందా? అలాగని అభినందించే సంస్కారం అంతకంటే లేదన్నారు. హిందువులపై కుళ్లు, కుతంత్రాలు తప్ప ఏమీ లేదన్నారు.

సామాన్యుడి నుంచి ఉన్నతస్థాయి వ్యక్తుల వరకు ఏడాదిలో ఒక్కసారైన తిరుమల వెంకటేశ్వరుడ్ని దర్శించుకోవాలని కోరుకుంటారని అన్నారు నాగబాబు. చివరకు కొండపై వసతి ఛార్జీలు ఎలా పెంచారని పలు ప్రశ్నలు లేవనెత్తారు. 500 రూపాయలకు దొరికే రూములను 1000 కి ఎలా పెంచారన్నారు. ఇది సామాన్యుడ్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కాదా? ఏ మాఫియాని సంతోష పెట్టడానికి చేశారో ప్రజలకు అంతా తెలుసన్నారు.

ALSO READ: జగన్‌పై ముద్రగడ కూతురు ఆగ్రహం.. ఇవేమి రాజకీయాలు

దర్శనాలు, సేవలు అయితే ఇంకా దారుణమన్నారు. బోర్డు మీటింగ్ లో అప్పటి ఛైర్మన్ వైవీ మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తిరుమలపై చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. ఎక్కడ కొండ కనిపించినా గుండు కొట్టాలన్నదే వైసీపీకి అలవాటని అన్నారు. అలాగే డిక్లరేషన్ విషయంలో జగన్ వ్యవహారశైలిని తూర్పారబట్టారు.

ఆనాడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చి టీటీడీ సంప్రదాయాలను గౌరవించారని, కలాం కంటే నువ్వు గొప్పోడివా అంటూ ప్రశ్నించారు.  మీ మంత్రి అన్నమాటలు గుర్తు లేవా? అలాంటి మాటలకు ప్రజలకు కిందకు దించారని, అయినా ఎలాంటి మార్పు రాలేదన్నారు.  కల్తీ నెయ్యి వ్యవహారంలో రేపు మాట్లాడుతానని ముగించారు నాగబాబు.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×