E-Paper
Advertisement

VinFast Electric Scooter: ఏడుకు తోడు మరో మూడు.. విన్ ఫాస్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!

VinFast Electric Scooter: ఏడుకు తోడు మరో మూడు.. విన్ ఫాస్ట్ ప్లాన్ మామూలుగా లేదుగా!
Advertisement

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ ఫాస్ట్..  తన ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారం మరింత విస్తరించేందుకు ప్రణాళికలు వేసింది. భారత్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియాలలో తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. పెరుగుతున్న పట్టణ రవాణా అవసరాలు, అనుకూలమైన జనాభా, క్లీన్ రవాణా ఎంపికల వైపు పెరుగుతున్న ఆదరణ కారణంగా తమ వాహనాల విక్రయాలను పెంచుకోవాలని భావిస్తుంది. ఈ దేశాల్లో ముందుగా తమ మార్కెట్ విస్తరణ కోసం కీలక ప్లాన్స్ రూపొందిస్తుంది. ఈ విస్తరణలో భాగంగా, ఫ్లాజ్, ఎవో, ఫెలిజ్ II, వైపర్ మోడళ్లతో సహా బ్యాటరీ ఛేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని విన్ ఫాస్ట్ భావిస్తోంది. ప్రతి మోడల్ స్థానిక రైడింగ్ పరిస్థితులు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా సరిపోయేలా డెవలప్ చేస్తుంది.

విన్ ఫాస్ట్ కీలక టార్గెట్

కంపెనీ దీర్ఘకాలిక వృద్ధికి సపోర్ట్ ఇవ్వడానికి, విన్ ఫాస్ట్ 2027 నాటికి ఈ మార్కెట్లలో వందల సంఖ్యలో రిటైల్ అవుట్‌ లెట్లను స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డీలర్‌ షిప్ నెట్‌వర్క్‌ లు, సర్వీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్సింగ్ సొల్యూషన్స్, ఎనర్జీ సపోర్ట్ సిస్టమ్‌లను కలిపి గో టు మార్కెట్ వ్యూహం అమలు చేయబోతోంది. ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి V-గ్రీన్‌తో టై అప్ కావాలని భావిస్తోంది.

2026లో మూడు స్కూటర్ లైనప్ లు

Advertisement

2025లో విన్‌ ఫాస్ట్ వియత్నాంలో 4,06,453 ఎలక్ట్రిక్ స్కూటర్లను డెలివరీ చేసింది. ఆ దేశంలోని స్కూటర్ విభాగంలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 10 కంటే ఎక్కువ మోడళ్ల పోర్ట్‌ ఫోలియో, ఫ్లెక్సిబుల్ ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి సపోర్టుతో, బ్రాండ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు మంచి సేల్స్ కొనసాగించాయి. 2026లో విన్‌ ఫాస్ట్ మూడు విభిన్న స్కూటర్ లైన్ ల మెన్ స్ట్రీమ్,  ప్రీమియం, స్పోర్ట్ కోసం రోడ్‌ మ్యాప్‌ ఫిక్స్ చేసింది. ఇప్పటికే ప్రీమియం, స్పోర్ట్ విభాల్లో ఏడు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. వాటికి ఇప్పుడు ఈ మూడు జతకాబోతున్నాయి.

అటు ప్రపంచ వ్యూహంలో భాగంగా ఫిలిప్పీన్స్ మొదటి లాంచ్ మార్కెట్‌గా సెలెక్ట్ చేసుకుంది. దేశ వ్యాప్తంగా అమ్మకాలు, సర్వీస్ నెట్‌ వర్క్‌ ను ఏర్పాటు చేయడానికి లుజోన్, మిండానావో మావెరిక్ రేసింగ్ ఫ్యాక్టరీ ఇంక్, మోటార్‌ సెంట్రల్, న్యూ నెమార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, సుప్రీంబైక్ కార్పొరేషన్  డీలర్లతో టై అప్ పెట్టుకోబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా, స్థానిక భాగస్వాములతో సహకారంతో పాటు, పూర్తి ఎలక్ట్రిక్ టాక్సీ ఆపరేటర్ అయిన GSM, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై దృష్టి సారించే V గ్రీన్ లాంటి కంపెనీలతో వ్యూహాత్మక పొత్తు పెట్టుకుంది. దీంతో ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, భారతీయ  మార్కెట్లలో గ్రీన్ మొబిలిటీని బాగా డెవలప్ చేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహన పోర్ట్‌ ఫోలియోను కూడా విస్తరించింది. కాంపాక్ట్ VF 3, పెద్ద VF 9 మోడళ్లను అందిస్తోంది.

భారత్ లో రెండు మోడళ్ల ఎలక్ట్రిక్ కార్ల అమ్మకం

Advertisement

విన్‌ఫాస్ట్ ప్రస్తుతం భారత మార్కెట్లో రెండు మోడల్స్ ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. వాటిలో ఒకటి VF6 కాగా, మరొకటి  VF7. VF6 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధర రూ. 16.49 లక్షల నుంచి రూ. 18.29 లక్షల వరకు ఉంది. VF7 ఐదు వేరియంట్లలో ఉంది. వీటి ధర రూ.  20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల వరకు ఉంది.

Read Also: 50 వేలకు స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్, ఒకే ఛార్జ్ తో ఎంత దూరం వెళ్తుందో తెలుసా?

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×