E-Paper
Advertisement

Dharmavaram: విజయవాడలో దాడి.. రంగంలోకి ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ధర్మవరం బంద్..

Dharmavaram: విజయవాడలో దాడి.. రంగంలోకి ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ధర్మవరం బంద్..
Advertisement
dharmavaram

Dharmavaram news(Latest news in Andhra Pradesh): ధర్మవరం బంద్‌కు పిలుపునిచ్చారు వస్త్ర వ్యాపారులు. వారం రోజుల పాటు వస్త్ర దుకాణాలను బంద్ చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలో ధర్మవరం వస్త్ర వ్యాపారులపై దాడికి నిరసనగా ఈ బంద్‌కు నిర్ణయం తీసుకున్నారు. అలాగే ధర్మవరం వస్త్రవ్యాపారులపై దాడిని ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్రంగా ఖండించారు. వస్త్ర వ్యాపారులను మీడియా ముందుకు తీసుకొచ్చారు ఆయన. ఇది వ్యక్తిపై జరిగిన దాడి కాదని.. వ్యవస్థపై జరిగిన దాడిగా అన్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి.

విజయవాడలో ఓ బట్టల షాపు యజమాని రెచ్చిపోయాడు. ధర్మవరానికి చెందిన ఇద్దరు బట్టల వ్యాపారులపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. రెండు వారాల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యాపారులను బట్టలు విప్పి కొడుతున్న వీడియో వైరల్ అయ్యింది.

Advertisement

ధర్మవరానికి చెందిన పట్టుచీరల వ్యాపారి..విజయవాడలోని ఓ వస్త్ర దుకాణానికి పట్టుచీరలు సప్లై చేస్తుంటాడు. అయితే సప్లై చేసిన చీరలకు డబ్బులు చెల్లించాలని షాపు యజమానిని అడగితే లేవంటూ దబాయించాడు. దీంతో ఆ వ్యాపారి..మరో వ్యాపారితో కలిసి డబ్బులు చెల్లించాలని షాపు యజమానిని డిమాండ్ చేశారు. దీంతో వారి మద్య జరిగిన వివాదంతో..వ్యాపారుల ఇద్దరిని షాపులో బందించి ఇరువురు పై షాపు యజమాని దాడికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే మరోసారి దాడి చేస్తాం అంటూ బెదిరించడంతో ..వారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనట్లు తెలుస్తుంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×