E-Paper
Advertisement

Naralokesh : పబ్లిసిటీ వద్దంటున్న మంత్రి నారా లోకేష్.. షాక్ అవ్వాల్సిందే!

Naralokesh : పబ్లిసిటీ వద్దంటున్న మంత్రి నారా లోకేష్.. షాక్ అవ్వాల్సిందే!
Advertisement

ఏపీ రాజకీయాల్లో తన మార్క్ చూపిస్తూ ముందుకు వెళ్తున్న మంత్రి నారా లోకేశ్.. విమర్శలు లెక్కచేయకుండా సాగుతున్నారు. ఎవరు ఏమైనా అనుకోని పెద్దగా పట్టించుకోనంటూ కొట్టిపారేస్తున్నారు. తనకు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల సుఖశాంతులే తనకు ముఖ్యమని, నమ్మి గెలిపించిన వారికి అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తానని అంటున్నారు. అప్పుడే వారిని మరోసారి ఓట్లు అడిగేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నట్టు తెలుస్తున్నది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే మంత్రి లోకేశ్ మీదే వైసీపీ నేతలు పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నట్టు సమాచారం.

విమర్శలు లైట్..

రాజకీయాల్లో మంచి చేసినా చెడు చేసినా విమర్శలు మాత్రం కామన్. అభివృద్ధి పేరిట ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కొందరికి నచ్చుతాయి. మరికొందరికి నచ్చవు. అయితే, నచ్చని వారు మనవారైనా, పగవారైనా అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని మంత్రి నారాలోకేశ్ తన సన్నిహతుల వద్ద అన్నట్టు తెలుస్తున్నది. అధికారులతోనూ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఐటీ, విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలు రాయితీలను ఆశిస్తున్నాయని, లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయే ప్రమాదం ఉన్నందునే కూటమి సర్కార్ వారికి రాయితీలు ఇచ్చి.. మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. అలా చేస్తేనే ఇక్కడి యువతకు ఉద్యోగాలు వస్తాయని కుండబద్దలు కొట్టింది. అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉన్న మంచిని కూడా ప్రతిపక్ష పార్టీ మాత్రం చెడునే చూపిస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నది. అందుకే మంత్రి లోకేశ్ వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది.

పబ్లిసిటీ అక్కర్లేదు..

Advertisement

ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎప్పుడైనా విమర్శలను పెద్దగా తీసుకోలేరు. కానీ క్రెడిట్ వస్తే తప్పకుండా ఆ ఘనత మాదే అని అంటారు. పబ్లిసిటీ మాత్రం ఓ రేంజులో చేసుకుంటారు.నియోజకవర్గంలో ఏదైనా చిన్న రోడ్డు వేయించినా, నల్లా కనెక్షన్లు ఇప్పించినా.. డ్రైనేజీ సౌకర్యం కల్పించినా మరల ఎన్నికలు వచ్చేంత వరకు పబ్లిసిటీ మాత్రం ఓ రేంజులో ఉంటుంది.కానీ, మంత్రి నారాలోకేశ్ మాత్రం అటు విమర్శలు.. ఇటు పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు. తాను చేయాలనుకున్నది సైలెంట్‌గా చేసుకుంటూ వెళ్తున్నారు. మంగళగిరికి పరిశ్రమలు తీసుకురావడంతో పాటు స్థానికంగా అభివృద్ధిని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు.

AP vs Telangana : రేవంత్ చంద్రబాబు.. జగన్ కేసీఆర్.. ఇదేం రాజకీయం!

Advertisement

ఇక ఇదే సమయంలో వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేలా చేసిన పనిని చెప్పుకుందామని.. పబ్లిసిటీ చేద్దామని కూటమి నేతలు చెబుతున్నా అవసరం లేదని ఆయన చెబుతున్నట్టు తెలిసింది. వచ్చేనెలలో గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ప్రతిపక్ష వైసీపీ విమర్శలకు చెక్ పెట్టేలా దీనిపై ప్రభుత్వం తరఫున ప్రచారం చేద్దామని పార్టీలో చర్చ జరిగినా ఆయన పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తున్నది. ప్రభుత్వం తన పని తాను చేసుకుని వెళ్తుందని.. అలాగే తానుసైతం తన పనిని చేసుకుంటూ ముందుకు వెళ్తానని..అభివృద్ధి సవ్యంగా జరిగితే ప్రజలే తమకు అంబాసిడర్లుగా ఉంటారని  చిన్న బాబు వ్యాఖ్యానించినట్టు ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.  ఈ విషయం తెలిసిన తెలుగుదేశం పార్టీ సీనియర్లు సైతం లోకేశ్ ఆలోచన విధానం చూసి షాక్ అవుతున్నట్టు తెలుస్తున్నది.

 

 

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×