E-Paper
Advertisement

Trending Smart TVs Jan 2026: కొత్త టీవీ కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్.. 2026 జనవరిలో ట్రెండ్ అవుతున్న స్మార్ట్ టీవీలు ఇవే!

Trending Smart TVs Jan 2026: కొత్త టీవీ కొనడానికి ఇదే కరెక్ట్ టైమ్.. 2026 జనవరిలో ట్రెండ్ అవుతున్న స్మార్ట్ టీవీలు ఇవే!
Advertisement

Trending Smart TVs Jan 2026: కొత్త ఏడాది మొదలైన తర్వాత చాలామంది ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని అనుకుంటారు. అందులో భాగంగా పాత టీవీని మార్చేయాలనే ఆలోచన కూడా చాలామందికి వస్తుంది. అలాంటి వారికి ఇప్పుడు మార్కెట్‌లో మంచి ఆప్షన్లు చాలానే ఉన్నాయి. ఎందుకంటే.. ఈ ఏడాది మార్కెట్‌లో టీవీ టెక్నాలజీ మరింత వేగంగా దూసుకువెళ్తుంది.

2026 జనవరిలో ట్రెండ్ అవుతున్న కొత్త టీవీల్లో కలర్స్ మరింత బ్రైట్‌గా, నేచురల్‌గా కనిపిస్తున్నాయి. పిక్చర్ క్వాలిటీ మాత్రమే కాదు.. AI ఆధారిత ఫీచర్లు కూడా బాగా అప్డేట్ అయ్యాయి. OLED, Mini LED, RGB Mini LED, QLED లాంటి లేటెస్ట్ డిస్‌ప్లే టెక్నాలజీలు ఇప్పుడు ఎక్కువగా వినియోగంలోకి వస్తున్నాయి. LG, Sony, Samsung, TCL, Xiaomi, Hisense వంటి టాప్ బ్రాండ్లు ఈ కొత్త టెక్నాలజీలతో లేటెస్ట్ సిరీస్‌లను తీసుకువచ్చాయి. అలాగే Google TV, webOS వంటి స్మార్ట్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల యాప్స్ ఉపయోగించడం, కంటెంట్ చూసుకోవడం మరింత సులభతరంగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని స్మార్ట్ టీవీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: ఇలాంటి ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు.. స్మార్ట్ టీవీతో పాటు రూ.93వేల సౌండ్‌బార్ ఫ్రీ భయ్యా!

RGB Mini LED టెక్నాలజీ

ఈ ఏడాది స్మార్ట్ టీవీల్లో కీలక మార్పులు తీసుకొచ్చిన టెక్నాలజీ RGB Mini LED. ఇప్పటివరకు చాలా టీవీల్లో బ్లూ LED ఆధారిత బ్యాక్‌లైట్ వాడేవారు. కానీ ఇప్పుడు ఎరుపు, ఆకుపచ్చ, నీలం LEDలను నేరుగా ఉపయోగించడం వల్ల రంగులు మరింత మెరుగ్గా, సహజంగా కనిపిస్తున్నాయి. కలర్ వాల్యూమ్ పెరగడం వల్ల సినిమాలు.. స్పోర్ట్స్, గేమింగ్ అన్నీ ఎంతో ప్రొఫెష్నల్‌గా అనిపిస్తున్నాయి. ఇది ముఖ్యంగా ప్రీమియం టీవీల్లో స్పష్టంగా కనిపించే అప్‌గ్రేడ్.

OLED టీవీలు

Advertisement

OLED టీవీలకు ఉన్న క్రేజ్ ఈ ఏడాది కూడా ఏమాత్రం తగ్గలేదు. LG, Sony, Samsung లాంటి బ్రాండ్‌లు కొత్త OLED మోడళ్లను మరింత మెరుగైన బ్రైట్‌నెస్, కలర్ అక్యూరసీతో తీసుకొచ్చాయి. ప్రతి పిక్సెల్ స్వయంగా లైటింగ్‌ను ఉత్పత్తి చేయడం వల్ల నలుపు రంగులు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. సినిమాలు ఎక్కువగా చూసేవాళ్లకు, హై క్వాలిటీ కంటెంట్ ఇష్టపడేవాళ్లకు OLED టీవీలు ఇంకా బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి.

QLED, Mini LED టీవీలు

కుటుంబం మొత్తం కూర్చుని చూడటానికి పెద్ద స్క్రీన్ కావాలనుకునే వాళ్లకు QLED, Mini LED టీవీలు సరైన ఎంపిక. TCL వంటి బ్రాండ్‌లు QD-Mini LED టెక్నాలజీతో పీక్ బ్రైట్‌నెస్, మంచి కాంట్రాస్ట్ అందిస్తున్నాయి. Hisense కూడా తమ QLED సిరీస్‌తో టీవీ యూజర్లను బలంగా ఆకట్టుకుంది. వెలుతురు ఎక్కువగా ఉండే గదుల్లో కూడా ఈ టీవీలు క్లియర్‌గా కనిపించడం వీటికి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

కృత్రిమ మేధ స్మార్ట్ ఫీచర్లు

ఈ ఏడాది అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ టీవీలు కేవలం పెద్ద స్క్రీన్ అనుభవాన్ని మాత్రమే కాకుండా.. చాలా స్మార్ట్‌గానూ యూజర్లకు వినోదం అందిస్తున్నాయి. వీటిలో భాగంగా Sony లాంటి బ్రాండ్‌లు తక్కువ రిజల్యూషన్ ఉన్న డిజిటల్ ఇమేజ్‌లను లేదా వీడియోలను AI ఫీచర్లు ఎంతో మెరుగ్గా, నాణ్యతగా చూపిస్తున్నాయి. అలాగే యూజర్ల మూడ్‌ను బట్టి కంటెంట్ ఎంపికలు, వాయిస్ కంట్రోల్, యూజర్ ఇష్టాల ఆధారంగా సెట్టింగ్స్ మార్చుకునే ఫీచర్లు కూడా ఈ టీవీల్లో అప్డేట్ అయ్యాయి.

Google TV, webOS ప్లాట్‌ఫాంలు:

స్మార్ట్ టీవీ ద్వారా వినియోగదారులను ఎంటర్టైన్ చేసే విషయంలో సాఫ్ట్‌వేర్ చాలా కీలకం. ఈ ఏడాది ఎక్కువగా Google TV, LG webOS ఆకట్టుకుంటున్నయి. ఇవి యూజర్‌కు సింపుల్ ఇంటర్‌ఫేస్, ఫాస్ట్ నావిగేషన్, అన్ని ప్రముఖ యాప్స్‌కు సపోర్ట్ ఇస్తున్నాయి. కొత్తగా టీవీ కొనేవాళ్లకు ఇలాంటి టీవీలు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి. మొత్తానికి.. జనవరి 2026లో కొత్త స్మార్ట్ టీవీలు గత ఏడాదితో పోలిస్తే మరింత అప్డేటెడ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. పాత మోడళ్లను అప్‌గ్రేడ్ చేయాలనుకునే వాళ్లకు లేదా కొత్తగా టీవీ కొనాలనుకునే వాళ్లకు ఇదే సరైన సమయం.

Also Read: 7600mAh బ్యాటరీతో iQOO Z11 Turbo భారత్‌లో లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లపై ఓ లుక్కేయండి!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×