E-Paper
Advertisement

స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రి లోకేష్.. వామపక్షాల నేతల వ్యాఖ్యలపై అసహనం

స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రి లోకేష్.. వామపక్షాల నేతల వ్యాఖ్యలపై అసహనం
Advertisement

Visakha: విశాఖ కేజీహెచ్‌లో స్టీల్‌ప్లాంట్ బాధిత కుటుంబాలను మంత్రులు లోకేశ్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ పరామర్శించారు.ఈ సందర్భంగా వారితో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని హామీ ఇచ్చారు మంత్రి లోకేష్.

స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంత్రులు లోకేష్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

Advertisement

విశాఖలోని స్టీల్‌ప్లాంట్ ప్రమాద బాధితులతో మంగళవారం ఉదయం మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు మంత్రులు లోకేష్, అనిత, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబాలను ఓదార్చారు.  ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సూరిబాబు, పైడిరాజు, శ్రీనివాసులను పరామర్శించారు.

ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచన చేశారు. ప్రభుత్వ పరంగా అన్నివిధాలుగా బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందరు కలిసి కాపాడుకోవడం వల్ల స్టీల్ ప్లాంట్‌ను కాపాడు కోగలిగామని అన్నారు. ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

కార్మికుల సంఘాలతో తీరుపై మంత్రి లోకేష్ అసహనం

అదే సమయంలో వామపక్షాల నేతలు అక్కడికి చేరుకున్నారు. జరిగిన ప్రమాదాలపై మంత్రులను నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో మంత్రి నారా లోకేశ్ అసహనం వ్యక్తంచేశారు. మీ కుటుంబ సభ్యులెవరూ చనిపోలేదు కదా? అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాజకీయాలు చేసేందుకు ఇది సమయం కాదని, చేయాలంటే బయటకు వెళ్లవచ్చన్నారు.

స్టీల్‌ప్లాంట్ ఘటనలో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు వామపక్ష నేతలు. వారికి సర్ది చెప్పారు మంత్రి నారా లోకేష్. తాము కేవలం డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదన్నారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు.

మరోవైపు స్టీల్ ప్లాంట్ ఘటనలో ముగ్గురు మృతదేహాలను గుర్తించారు డాక్టర్లు. వారిలో భానుకుమార్, రమణ, అప్పలరాజు మృతదేహాలు ఉన్నారు. మిగిలినవారి మృతదేహాల గుర్తింపు కోసం కేజీహెచ్‌లో డీఎన్ఏ పరీక్షలు పూర్తి చేశారు. మృతదేహాలు గుర్తు పట్ట లేనంత విధంగా ఉన్నాయి. ఆయా పరీక్షల కోసం బాధిత కుటుంబాల నుంచి నమూనాల సేకరించారు అధికారులు.

ALSO READ: 96 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. వీరాభిమాని కోరిక తీర్చిన సీఎం చంద్రబాబు, 10 నిమిషాల సేపు

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×