E-Paper
Advertisement

మూడు 50MP కెమెరాలతో Oppo Find X9s భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!

మూడు 50MP కెమెరాలతో Oppo Find X9s భారత్‌లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
Advertisement

Oppo Find X9s: భారతదేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ప్రియులను ఆకట్టుకోవడానికి ఒప్పో నుంచి సరికొత్త మోడల్ Oppo Find X9s మార్కెట్లో విడుదలైంది. దీంతోపాటు Find X9 Ultraను కూడా కంపెనీ తీసుకొచ్చింది. అద్భుతమైన డిజైన్, పవర్‌ఫుల్ కెమెరా, లాంగ్ లైఫ్ బ్యాటరీ బ్యాకప్‌తో వచ్చిన ఈ ఫోన్ ప్రస్తుతం టెక్ మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ ఫోన్ చూడటానికి చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. దీనిలో 6.59 ఇంచుల AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది కాబట్టి.. ఫోన్ స్క్రీన్ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. అలాగే స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని ఉపయోగించారు. కలర్స్‌ కూడా చాలా రిచ్‌గా కనిపిస్తాయి.

Advertisement

Also Read: ఐఫోన్ వాడుతున్నారా? వాట్సప్‌లో వచ్చిన ఈ కొత్త మార్పు చూశారా.. ఇక పండగే!

ఇక స్పీడ్ విషయానికి వస్తే.. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9500s ప్రాసెసర్‌ను వాడారు. దీనివల్ల గేమ్స్ ఆడినా, హెవీ యాప్స్ వాడినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ బేస్డ్ కలర్ ఓఎస్ 16 తో పనిచేస్తుంది. దీని అన్నింటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. ఏకంగా 7025mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది.

Advertisement

ఈ Oppo Find X9sలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. వెనుక వైపు మూడు కెమెరాలు కూడా 50MP సామర్థ్యం కలిగినవే కావడం విశేషం. మెయిన్ కెమెరాతో పాటు టెలిఫోటో కెమెరాకు కూడా OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉంది. దీనివల్ల చేతులు ఊగినా ఫొటోలు, వీడియోలు బ్లర్ కాకుండా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం ముందు వైపు 32MP కెమెరా ఇచ్చారు. దీనితో 4K వీడియోలు కూడా రికార్డ్ చేసుకోవచ్చు.

Oppo Find X9s ఫోన్ మిడ్‌నైట్ గ్రే, లావెండర్ స్కై, సన్‌సెట్ ఆరెంజ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఇకపోతే 12GB RAM +256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.79,999గా ఉంది. అలాగే 12GB RAM +512GB స్టోరేజ్ టాప్ ఎండ్ మోడల్ ధరను రూ.89,999గా నిర్ణయించారు. అలాగే ఇందులో ఇన్‌డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, వై-ఫై 7, ఈ-సిమ్ (eSIM) లాంటి లేటెస్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Also Read: షాకింగ్ ఫీచర్లతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌వాచ్‌లు.. మార్కెట్లోకి వచ్చేది అప్పుడే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×