E-Paper
Advertisement

Liquor Bottle In Tirumala: తిరుమలలో లిక్కర్ బాటిళ్లు.. ప్రభుత్వంపై భూమన ఫైర్, సీసీటీవీ ఫుటేజ్ ఏది?

Liquor Bottle In Tirumala:  తిరుమలలో లిక్కర్ బాటిళ్లు.. ప్రభుత్వంపై భూమన ఫైర్, సీసీటీవీ ఫుటేజ్ ఏది?
Advertisement

Liquor Bottle In Tirumala: తిరుమలలో మద్య సీసాలు వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పలువురు అరెస్టు కావడంతో వైసీపీ ఉలిక్కిపడింది. దీనిపై రియాక్ట్ అయ్యింది. కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి. కావాలంటే ఆ వ్యవహారానికి సంబంధించి సీసీఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 

Advertisement

తిరుమలలో లిక్కర్ బాటిళ్లు వ్యవహారంలో కొత్త కోణం

Advertisement

జనవరి నాలుగున తిరుమలలో మద్యం బాటిళ్లు దర్శనమంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ వ్యవహారంపై టీటీడీ, పోలీస్- విజిలెన్స్ విభాగాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు అధికారులు. దీంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వాహన రాకపోకలు, సాంకేతిక దర్యాప్తు ద్వారా ఈ కుట్రను వైసీపీ వాళ్లు చేసినట్టు తేలింది. వైసీపీ కార్యకర్త కోటి, ఆ పార్టీ ఫోటోగ్రాఫర్ మోహన్‌కృష్ణ పక్కాగా స్కెచ్ వేసినట్టు నిర్థారించారు అధికారులు. ఈ క్రమంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై శుక్రవారం ఉదయం వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా ముందుకొచ్చారు.

ప్రభుత్వంపై భూమన ఫైర్, సీసీటీవీ ఫుటేజ్ ఏది?

ఈ వ్యవహారంపై నోరు విప్పారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. చేసిన తప్పిదాలు కప్పి పుచ్చుకోవడానికి సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఛైర్మన్ బీఆర్ నాయుడు తప్పుడు కేసు నమోదు చేయించారని ఆరోపించారు. దీనిపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు.

ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యం కొండపై తిష్ట వేసి ఇలాంటి అకృత్యాలు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్త కోటి దీనిపై వీడియో తీసి బయటపెట్టారని, అతడిపై తప్పుడు కేసు పెట్టి ఆ తర్వాత కొట్టారని విమర్శించారు. పోలీసులు గుర్తించిన ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

25 గోనె సంచుల నిండా ఖాళీ మద్యం బాటిల్స్ బయట పడింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. వీరిపై బీఎన్ఎస్ సెక్షన్ 152 కింద కేసు పెట్టడం అత్యంత దారుణమన్నారు. న్యాయమూర్తులు ఉండడం వల్ల తాము బ్రతికి బట్ట కడుతున్నామని, లేదంటే మాకు జైళ్లు ఆవాస కేంద్రాలుగా మారేవన్నారు.

ALSO READ: బిగ్ అలర్ట్.. దూసుకొస్తున్న తుపాన్,  భారీ వర్షాలు ఎన్నిరోజులంటే.. 

ఈ విషయంలో అలిపిరి వద్ద నిఘా-భద్రత వ్యవస్థ ఏం చేస్తోందని సూటిగా ప్రశ్నించారు. ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రైవేట్ సైన్యం తాగి పడేసిన మందు బాటిల్స్ అని ఆరోపణలు చేశారు. కోటి అనే వ్యక్తి మద్యం బాటిల్స్ పెట్టినట్లు సాక్ష్యం చూపించాలని సవాల్ విసిరారు. హైందవ ధర్మ పరిరక్షణ కు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, మీరు చర్చకు సిద్ధమా అంటూ పాయింట్‌ని డైవర్ట చేసే ప్రయత్నం చేశారు.

అరెస్ట్ చేసినా తన గొంతు ఆగదని, తిరుమలపై ఏది జరిగినా ప్రశ్నిస్తామని తేల్చి చెప్పారు భూమన. బీఆర్ నాయుడుకి కోపం తగ్గాలంటే తనను మీ ఇంట్లో బంధించాలని సలహా ఇచ్చారు. ఫోటోగ్రాఫర్ మోహన్‌కృష్ణ ఇంటికి 40 మంది పోలీసులు పంపించి భయబ్రాంతులు గురి చేశారని, మీరు చేస్తున్న ఘోరాలు-నేరాలు ప్రజలకు తెలియజేస్తామన్నారు.

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×