E-Paper
Advertisement

Realme Pad 3: 12,200mAh బ్యాటరీతో రియల్‌మీ ప్యాడ్ 3 భారత్‌లో లాంచ్.. దీని అత్యాధునిక ఫీచర్లకు ఫిదా అయిపోతారు!

Realme Pad 3: 12,200mAh బ్యాటరీతో రియల్‌మీ ప్యాడ్ 3 భారత్‌లో లాంచ్.. దీని అత్యాధునిక ఫీచర్లకు ఫిదా అయిపోతారు!
Advertisement

Realme Pad 3: చైనాకు చెందిన ప్రముఖ రియల్‌మీ సంస్థ తన కొత్త ట్యాబ్లెట్ రియల్‌మీ ప్యాడ్ 3ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. పెద్ద డిస్‌ప్లే, మంచి ప్రాసెసర్ కలిగి ఉన్న ఈ ట్యాబ్లెట్‌ను.. భారీ బ్యాటరీతో ఇటు స్టూడెంట్స్‌తో పాటు అటు ప్రొఫెష్నల్స్‌, ట్యాబ్లెట్ ద్వారా సినిమాలు, సిరీస్ చూసే వినియోగదారుల కోసమే రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ Realme Pad 3 యొక్క ధర, ఫీచర్లు, ఇతర వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

మెరుగైన పనితీరు:

భారత మార్కెట్లోకి వచ్చిన Realme Pad 3 11.61 అంగుళాల 2.8K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 7:5 యాస్పెక్ట్ రేషియోతో వచ్చిన ఈ స్క్రీన్ ఎడ్యుకేషన్, మల్టీటాస్కింగ్‌కు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ ట్యాబ్లెట్ 60Hz / 90Hz / 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. స్క్రీన్ మీద బ్లూ లైట్ సర్టిఫికేషన్లతో కళ్లకు తక్కువ ఒత్తిడి కలిగిస్తుంది. దీనిలో 4nm టెక్నాలజీపై ఆధారిత మీడియాటెక్ డెమెన్సిటీ 7300 Max ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను వాడారు. దీంతోపాటు Mali-G615 MC2 GPUతో గేమింగ్, హెవీ యాప్స్ వినియోగంలో మెరుగైన పనితీరు ఈ ట్యాబ్లెట్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.

Advertisement

Also Read: బెస్ట్ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్.. రియల్‌మీ నియో 8 ఫీచర్లు తెలిస్తే ఎగిరి గంతులేస్తారు బాస్!

6.6mm స్లిమ్ బాడీ:

రియల్‌మీ ప్యాడ్ 3.. 8GB RAMతో పాటు 128GB/ 256GB స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. అలాగే మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు మెమరీ మద్దతు ఇస్తుంది. ఈ Tab ఆండ్రాయిడ్ 16 ఆధారిత realme UI 7.0పై రన్ అవుతుంది. దీనిలో క్లిన్ ఇంటర్‌ఫేస్‌తో పాటు ప్రొడక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. రియల్‌మీ ప్యాడ్ 3.. 8మెగాపిక్సల్ రియర్ కెమెరా, 8మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. అలాగే ఇది 6.6mm స్లిమ్ బాడీతో ప్రీమియం లుక్ కలిగి ఉంటుంది. దీంతోపాటు భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఇచ్చారు.

5G కనెక్టివిటీ:

Advertisement

ఇక ఆడియో, కనెక్టివిటీ పరంగా చూసుకుంటే.. మెరుగైన ఫీచర్లు, క్వాడ్ స్పీకర్స్ ఉండటంతో పవర్‌ఫుల్ సౌండ్ అనుభూతిని పొందవచ్చు. USB Type-C ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల ఆధునిక యాక్సెసరీస్‌ను ఈజీగా ప్లే చేసుకోవచ్చు. అలాగే ఎంపిక చేసిన వేరియంట్లలో 5G కనెక్టివిటీ అందించగా, Wi-Fi ac, బ్లూటూత్ 5.4 వంటి ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఈ ట్యాబ్లెట్‌లో ఉన్నాయి.

ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే:

Realme Pad 3లో 12,200mAh భారీ సామర్థ్యం కలిగిన స్లిమ్ టైటాన్ బ్యాటరీని అందించారు. ఇది దీర్ఘకాలం వినియోగానికి అనుకూలంగా ఉండటంతో పాటు 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలాగే 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఇతర డివైసులను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

ధర వివరాలు ఇలా:

8GB RAM + 128GB స్టోరేజ్ ఉన్న Wi-Fi వేరియంట్ ధర రూ.26,999 ఉండగా.. బ్యాంక్ లేదా యూపీఐ డిస్కౌంట్‌తో పాటు నో-కాస్ట్ EMI ఆఫర్ల ద్వారా ఈ ట్యాబ్లెట్‌ను రూ.24,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే 8GB + 128GB 5G వేరియంట్ రూ.29,999 కాగా.. ఆఫర్ ధర రూ.27,999గా నిర్ణయించారు. ఇక 8GB + 256GB 5G వేరియంట్ రూ.31,999 ఉండగా, ఆఫర్లో రూ.29,999కే పొందవచ్చు. ఈ రియల్‌మీ ప్యాడ్ 3.. ఈనెల 16 నుంచి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయానికి రానుంది.

Also Read: మూవీ లవర్స్‌కు పండగే పండగ.. నెట్‌ఫ్లిక్స్ సర్టిఫైడ్ పోర్ట్రానిక్స్ బీమ్ 560 ప్రొజెక్టర్ లాంచ్!

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×