E-Paper
Advertisement

Teacher Attacks minor girl: నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్.. స్కూల్ వద్ద ఉద్రిక్తత.

Teacher Attacks minor girl: నాలుగేళ్ల చిన్నారిని చితకబాదిన టీచర్.. స్కూల్ వద్ద ఉద్రిక్తత.
Advertisement

Teacher Attacks minor girl: అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. శ్రీవివేకానంద ప్రైవేట్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల చిన్నారిపై  టీచర్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు పేరుతో చిన్నారిని స్కేల్‌తో కొట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చెల్లూరు గ్రామానికి చెందిన ఆ బాలిక నొప్పితో బాధపడుతూ ఇంటికి చేరుకోవడంతో తల్లిదండ్రులు విషయాన్ని గమనించారు. వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన చిన్నారి తల్లిదండ్రులు,  బంధువులు స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. చిన్నపిల్లలపై ఇలాంటి దాడులు సహించబోమని..  బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా చిన్నారిని కొట్టిన టీచర్‌తో పాటు ఆమెను నియంత్రించడంలో విఫలమైన స్కూల్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. స్కూల్‌లో పిల్లలకు భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నిస్తూ యాజమాన్యాన్ని నిలదీశారు. ధర్నాతో స్కూల్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Advertisement

అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న మంత్రి వాసంశెట్టి అక్కడి పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు అత్యంత బాధాకరమని, చిన్నపిల్లలపై హింస ఏమాత్రం సహించరాదని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా అధికారులకు సూచనలు ఇస్తామని హామీ ఇచ్చారు.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రైవేట్ స్కూల్స్‌పై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని మంత్రి వాసంశెట్టి తెలిపారు. పిల్లల భద్రత, మానసిక ఆరోగ్యం ముఖ్యమని పేర్కొంటూ..  స్కూల్ యాజమాన్యాలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

ALSO READ: Divvela Madhuri: మాధురితో మాటలు.. పాత కేసుతో జైలుకి.. అప్పన్న అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×