E-Paper
Advertisement

BJP MLAs Sleeping: అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఒకరు పారిపోయారు.. మరొకరు పడుకున్నారు!

BJP MLAs Sleeping: అసెంబ్లీలో అరుదైన దృశ్యం: ఒకరు పారిపోయారు.. మరొకరు పడుకున్నారు!
Advertisement

BJP MLAs Sleeping: తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాల పంపిణీ, ప్రాజెక్టుల స్థితిగతులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా ప్రతిపక్షాల తీరు విస్మయం కలిగించింది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి సీరియస్ చర్చ జరుగుతుండగా.. సభలో ఉన్న కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రపోతూ (కునుకు తీస్తూ) కనిపించడం చర్చనీయాంశమైంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు. వాస్తవాలను ఎదుర్కోలేకే బీఆర్ఎస్ నేతలు సభ నుంచి పారిపోయారని, బీజేపీ నేతలేమో బాధ్యతారాహిత్యంగా నిద్రపోతున్నారని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు.

అప్పుడు వద్దన్నారు.. ఇప్పుడు పీపీటీ ఇస్తారా?

గతంలో కేసీఆర్‌ అసెంబ్లీలో పీపీటీ ఇస్తే సంప్రదాయాలకు విరుద్ధమని నాడు లేఖలు రాసిన ఉత్తమ్‌, భట్టి.. నేడు అదే పద్ధతిని అనుసరించడం కాంగ్రెస్ ద్వంద్వ నీతికి నిదర్శనమని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఏసీలో తమ విజ్ఞప్తిని తిరస్కరించారని గుర్తుచేస్తూ.. మంత్రి ఉత్తమ్‌కు పీపీటీ అవకాశం ఇచ్చినట్లే, తమకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement

Read Also: Uttam Kumar Reddy: కృష్ణా జలాలను ఏపీకి తాకట్టు పెట్టారు.. అసెంబ్లీలో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టిన మంత్రి ఉత్తమ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×