E-Paper
Advertisement

ONGC Gas Leak: కోనసీమలో ఆరని గ్యాస్ లీక్ మంటలు.. అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్‌జీసీ సంప్రదింపులు

ONGC Gas Leak: కోనసీమలో ఆరని గ్యాస్ లీక్ మంటలు.. అంతర్జాతీయ నిపుణులతో ఓఎన్‌జీసీ సంప్రదింపులు
Advertisement

ONGC Gas Leak: కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటనపై ఓఎన్జీసీ స్పందించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఇరుసుమండ ఘటనాస్థలికి అగ్ని మాపక సిబ్బందిని పంపిస్తున్నామని పేర్కొంది. గ్యాస్ లీకైన ప్రదేశం మారుమూల ప్రాంతంలో ఉందని, అక్కడికి సుమారు 600 మీటర్ల వరకు నివాస ప్రాంతం లేదని తెలిపింది. గ్యాస్ లీక్‌ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిపింది. గ్యాస్ లీక్, మంటలను అదుపు చేసేందుకు సిబ్బంది అన్ని రకాల చర్యలను తీసుకొంటున్నారని పేర్కొంది. గ్యాస్‌ లీక్‌ ఆపేందుకు అంతర్జాతీయ నిపుణులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నామని తెలిపింది. ఓఎన్‌జీసీ సీనియర్‌ నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని లేఖలో పేర్కొంది.

24 గంటల సమయం

కోనసీమ జిల్లాలో మలికిపురం మండలం ఇరుసుమండలో ఇంకా గ్యాస్ లీకేజీ ఆగలేదు. గ్యాస్ లీకేజీతో మంటలు ఆరలేదని అధికారులు తెలిపారు. ఇరుసుమండ గ్రామం చుట్టూ కిలోమీటర్ల మేర గ్యాస్ వ్యాపించింది. గ్యాస్ లీక్ కాకుండా ఆపేందుకు కనీసం 24 గంటల సమయం పడుతుందని.. గ్యాస్ నిల్వలు అయిపోతేనే మంటలు ఆగుతాయని అధికారులు అంటున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు.

Advertisement

అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో సోమవారం మధ్యాహ్నం భారీగా గ్యాస్ లీకైంది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఓఎన్జీసీ బావికి రీ డ్రిల్లింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా గ్యాస్ ఎగిసిపడి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా గ్యాస్ వాసన వ్యాపించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాద భయంతో ఇళ్ల నుంచి దూరంగా పరుగులు తీశారు గ్రామస్థులు.

Also Read: ఇరుసుమండ ఓఎన్‌జీసీ సైట్ లో భారీగా గ్యాస్ లీక్.. ఎగిసిపడుతున్న మంటలు

Advertisement

ఓఎన్జీసీ గ్యాస్‌ లీకేజీని అదుపు చేసేందుకు, మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ మహేశ్‌ కుమార్‌ తెలిపారు. మలికిపురం ఘటనపై కలెక్టర్ మాట్లాడుతూ.. మంటలు అదుపులోకి వచ్చేందుకు 24 గంటలు ఆగాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×