// // Sankranti Festival: సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. హాలిడేస్ ఎన్ని రోజులంటే..? -->
E-Paper
Advertisement

Sankranti Festival: సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. హాలిడేస్ ఎన్ని రోజులంటే..?

Sankranti Festival: సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. హాలిడేస్ ఎన్ని రోజులంటే..?
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగైన సంక్రాంతి. ఈ పండుగ వచ్చిందంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చిన్నల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సంక్రాంతి పండుగకు సంబంధించి తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను ఖరారు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఉండనున్నాయి.

వరుసగా ఏడు రోజుల పాటు పండుగ సెలవులు ముగిసిన తర్వాత తిరిగి జనవరి 17 శనివారం రోజున పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. పండుగ జరుపుకోవడానికి సొంత ఊళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఈ సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు ఈ షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు చేస్తాయేమో అన్న ఉత్కంఠ ఉన్నప్పటికీ.. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

Advertisement

మరోవైపు, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల కాలపరిమితి కాస్త ఎక్కువగా ఉంది. ఏపీ ప్రభుత్వం ఈ నెల 10 నుంచి 18 వరకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడ 19వ తేదీన పాఠశాలలు తెరుచుకోనున్నాయి. తెలంగాణలో మాత్రం 16తోనే సెలవులు ముగియనుండటంతో.. 17 నుంచే తరగతులు యథావిధిగా కొనసాగనున్నాయి. సంక్రాంతి సంబరాల కోసం విద్యార్థులు ఇప్పటికే ప్రయాణ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ALSO READ: BIG Academy: బిగ్ అకాడమీ సరికొత్త విద్యా విధానం.. రేపే ప్రారంభం, బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×