E-Paper
Advertisement

11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు ద‌గ్దం.. బస్సులో 21 మంది ప్రయాణికులు

11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు ద‌గ్దం.. బస్సులో 21 మంది ప్రయాణికులు
Advertisement

Vempalli RTC Bus Fire Accident: వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి మండలంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. మండలంలోని వీరన్నగట్టుపల్లి గ్రామ సమీపంలో 11 కేవీ విద్యుత్ తీగలు తగిలి ఆర్టీసీ బస్సు పూర్తిగా దహనమైంది. కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేంపల్లి నుండి కదిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు వెళ్తున్న క్రమంలో పైన ఉన్న విద్యుత్ తీగలు బస్సు టాప్‌కు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సుపై మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సును ఆపివేశారు. దీంతో ప్రయాణికులందరూ హుటాహుటిన బస్సు నుండి కిందకు దిగిపోయారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు అంతటా వేగంగా వ్యాపించాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రాణనష్టం తప్పిందని, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

మంటలు క్రమక్రమంగా బస్సు మొత్తం వ్యాపించడంతో ఆర్టీసీ బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా దహనమైంది. విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read Also: అమెరికాకు వరుస షాకులు.. రెస్క్యూ విమానం కూల్చివేత.. సొంత విమానాలనే పేల్చివేసిన అమెరికా సైన్యం..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×