E-Paper
Advertisement

Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?

Arava Sridhar: పవన్ కళ్యాణ్ గారూ.. ఇదేనా మీ ‘ప్రశ్నించే’ తత్వం.. సొంత ఎమ్మెల్యేపై చర్యలేవి?
Advertisement

Arava Sridhar: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం పార్టీని కుదిపేస్తున్నా అధిష్టానం స్పందించపోవడం విమర్శలు మూడు గట్టుకుంటోంది. రెండు నెలలుగా బాధిత మహిళ వరుస వీడియోలు రిలీజ్ చేయడం.. పరస్పర కేసులు.. పార్టీ త్రిసభ్య కమిటీ విచారణ అన్నీ అటకెక్కాయి.. దాంతో ఇంకేముందిలే .. ఇక అడిగేదెవరు అని ఆ ఎమ్మెల్యే మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ మొదలెట్టారో లేదో మళ్ళీ బాధిత మహిళ వరుస వీడియోలు విడుదల చేస్తూ కలకలం రేపుతున్నారు. దాంతో ఎమ్మెల్యే ప్రస్టేషన్లో ఆ మహిళమై దాడి చేయించి మరింత ఊబిలో ఇరుక్కు పోయారు.. ఇంత జరుగుతున్నా జనసేనాని ఎందుకు సైలెంట్ ఉన్నారు? ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతోంది?

అరవ శ్రీధర్ కేసు రాజకీయాల్లో దుమారం

రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపులు ఆరోపణలు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. ఎమ్మెల్యే హోదాలో ఆయన తన నియోజకవర్గం లోని ఒక మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు పెద్ద కలకలమే రేపాయి. ఆ సాగించిన వ్యవహారంలో ఎమ్మెల్యే కారణంగా తాను ఐదు సార్లు అబార్షన్ చేయించుకున్నానని సదరు ఉద్యోగిని వీడియో టేపులు, ఆడియో లీకులు రిలీజ్ చేసి తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఆ ఆరోపణలపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పందించి వెంటనే పార్టీ తరపున విచారణకు ఆదేశించి త్రిసభ్య కమిటీ నియమించారు. అరవ శ్రీధర్‌ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు.

కమిటీ విచారణ తర్వాత సైలెన్స్

Advertisement

కమిటీ సైతం రైల్వేకోడూరు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి, ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరిపింది.. సీన్ కట్ చేస్తే రెండు నెలలు గడిచింది. కమిటీ తన నివేదికలో ఏం పేర్కొందో బహిర్గం కాలేదు. పార్టీ పరంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో ఇంకేముంది అంతా అయిపోయింది, అందరు ఘటనను మర్చిపోయారులే, అనుకున్నారో ఎమో సదరు ఎమ్మెల్యే మాత్రం మళ్ళీ దర్జాగా పార్టీ కండువాతో మళ్ళీ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టారు.

మళ్లీ మంటలు రేపిన కేసు

కానీ బాధిత మహిళ మాత్రం మళ్ళీ ప్రశ్నించడం మొదలు పెట్టింది. వరుస వీడియోలతో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు అధినేత పవన్‌పై ప్రశ్నల వర్షం కురిపించడంతో వ్యవహారం మళ్ళీ హీటెక్కెంది. కోడూరులో ఉంటూ ఆ మహిళ తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తుండటం, డైరెక్ట్ గా స్థానిక టీడీపీ ఇన్చార్జ్‌ని కలిసి ప్రజాదర్బార్ కు వెళ్ళి ఫిర్యాదు చేయడంతో సమస్య మళ్ళ మరింత జఠిలంగా మారింది. ఆ క్రమంలో తాజాగా బాధిత మహిళపై జనసేన అధికార ప్రతినిధి తాతంశెట్టి నాగేంద్ర తన అనుచరులతో బౌతిక దాడికి దిగడం కలకలం సృష్టిస్తోంది.

ప్రశ్నించిన మహిళపై దాడి

Advertisement

ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు, విచారణ కమిటీ నివేదిక ఎందుకు బహిర్గతం చేయలేదని బాధిత మహిళ ప్రశ్నిస్తుంటే, ఆమెపై జనసేన నేత దాడి చేయడం పార్టీని మరింత ఇరకాటంలోకి నెట్టినట్లైంది. మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తా అని అవేశంతో ఊగిపోతూ ప్రసంగాలు ఇచ్చే జనసేనాని తమ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి మీనమేషాలు లెక్కపెడుతుండటం ప్రత్యర్ధులకు అస్త్రంగా మారుతోందంటున్నారు. ప్రశ్నించడాని పార్టీ పెట్టానని చెప్పే పవన్‌కళ్యాణ్ ఈ ఎపిసోడ్‌లో తానే ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తున్నా నోరు మెదకపోతుండటం చర్చనీయాంశంగా మారింది.

బాధిత మహిళపై దాడి.. పవన్ రియాక్షన్ ఏంటి?

ఒక వేళ తమ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేయకపోతే ఎందుకు అదే విషయం చెప్పడం లేదని సామాన్యలు సైతం ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తూ.. ఒక తప్పుని కప్పి పుచ్చుకోవడానికి .. మరో తప్పు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అరవ శ్రీధర్ వ్యవహారం లో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక పార్టీ సతమతమవుతుంటే, ఇప్పుడు అదే బాధిత మహిళ పై నడి రోడ్డులో పోలీస్ లాఠీ లాక్కొని జనసేన నేత తాతంశెట్టి దాడి చేశారు. ఈ నేపధ్యంలో ఇష్యూ మరింత వివాదాస్పదం అవ్వడంతో.. అరవ శ్రీధర్ , జనసేన అధికార ప్రతినిధి తాతంశెట్టిలపై పవన్‌కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను సాధిద్దాం.. మంత్రి జూపల్లి కృష్ణారావు

Story by: Apparao, Big Tv

Related News

బాక్సింగ్ రింగ్ నుంచి ఐఏఎస్ వైపు.. గోదావరి తేజస్విని శైలజ స్ఫూర్తి కథనం

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

తెలంగాణలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్!

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

Big Stories

Advertisement
×