E-Paper
Advertisement

కడప స్టీల్ ప్లాంట్.. అప్పుడు జగన్, ఇప్పుడు బాబు.. అసలు ‘క్రెడిట్’ ఎవరిది?

కడప స్టీల్ ప్లాంట్.. అప్పుడు జగన్, ఇప్పుడు బాబు.. అసలు ‘క్రెడిట్’ ఎవరిది?
Advertisement

Kadapa Steel Plant: ఆల్రెడీ జగన్ శంకుస్థాపన చేశారు! ఇప్పుడు మళ్లీ చంద్రబాబు భూమి పూజకు రెడీ అయ్యారు! అంతే.. రాయలసీమలో రాజకీయం భగ్గుమంది. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో.. వైసీపీ, టీడీపీ మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. అప్పుడు వాళ్లేం చేశారు? ఇప్పుడు వీళ్లేం చేయబోతున్నారు?

అప్పుడు జగన్, ఇప్పుడు బాబు

Advertisement

ఏపీ పాలిటిక్స్‌లో చాలా నెలల గ్యాప్ తర్వాత కడప స్టీల్ ప్లాంట్ మంటలు అంటుకున్నాయ్. ఎల్లుండి భూమి పూజ చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. అంతే.. వైసీపీకి చిర్రెత్తుకొచ్చింది. 2023 మార్చిలోనే జిందాల్ స్టీల్‌కు.. అప్పటి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయడమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తోంది వైసీపీ.

చలో కడప స్టీల్ ప్లాంట్ 

Advertisement

అంతటితో ఆగకుండా.. చలో కడప స్టీల్ ప్లాంట్‌‌ అంటూ ఆందోళనకు పిలుపునిచ్చింది. జిందాల్ సంస్థనే మళ్లీ తెచ్చి భూమిపూజ చేయడం కంటే, ఈ గవర్నమెంట్ నేరుగా నిర్మాణ పనులు మొదలుపెట్టి స్టీల్ ప్లాంట్‌ పూర్తి చేయొచ్చు కదా అనేది వైసీపీ వాదన. అలాకాకుండా.. మళ్లీ భూమి పూజ పేరుతో టైంపాస్ చేయడం దేనికంటూ వైసీపీ క్వశ్చన్ చేస్తోంది. టీడీపీ నుంచి కూడా గట్టిగానే కౌంటర్ ఎటాక్ కనిపిస్తోంది.

Also Read: ‘గొడ్డలి పార్టీ’ని తరిమికొట్టండి.. నెల్లూరు వేదికగా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

స్టీల్ ప్లాంట్ క్రెడిట్ వార్

వైసీపీ హయాంలో బోర్డులు మార్చడం, శంకుస్థాపనకు పరిమితం చేయడం తప్ప.. స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు కేంద్రం సహకారంతో.. మౌలిక వసతులన్నీ కల్పిస్తూ.. స్టీల్ ప్లాంట్ కలను తామే సాకారం చేస్తున్నామని టీడీపీ చెబుతోంది. మొత్తానికి రెండు పార్టీల మధ్య కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్ వార్ గట్టిగానే నడుస్తోంది. అయితే.. పొలిటికల్ మ్యాజిక్‌లు ఎలా ఉన్నా.. స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసిన వారికే పబ్లిక్‌లో మైలేజ్ ఉంటుందనేదే అసలు లాజిక్. కేవలం భూమిపూజలకే నోచుకుంటున్న కడప స్టీల్ ప్లాంట్.. ఈసారైనా శంకుస్థాపన దాటి నిర్మాణం దిశగా పట్టాలెక్కుతుందా? అనే డౌట్ ఇప్పటికీ రాయలసీమ ప్రజల్లో ఉంది.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×