E-Paper
Advertisement

తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు సేఫేనా? వరుస ప్రమాదాలపై ప్రజాందోళన!

తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు సేఫేనా? వరుస ప్రమాదాలపై ప్రజాందోళన!
Advertisement

Electric Bus: తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు భయపెడుతున్నాయ్. వరుస ప్రమాదాలతో.. కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయ్. లేటెస్ట్‌గా కరీంనగర్‌లోనే రెండు యాక్సిడెంట్లు జరిగాయ్. ఆ మధ్య హన్మకొండలోనూ సేమ్ సీన్. అంతే.. బ్యాటరీ బస్సుల్లో జర్నీ సేఫేనా? అనే అనుమానం మొదలైంది జనాల్లో! మరి.. సేఫేనా?

తెలంగాణ సర్కారుకు.. ఇదో హెచ్చరిక!

Advertisement

ఎలక్ట్రిక్ బస్సులొస్తే.. ఫ్యూయల్ సేవ్ అవుతుంది. జర్నీ సేఫ్‌గా సాగుతుందనుకున్నారు. కానీ.. కరీంనగర్, హన్మకొండలో జరిగిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు యాక్సిడెంట్లు చూశాక.. కొత్త భయం మొదలైంది. తెలంగాణ సర్కారుకు.. ఇదో హెచ్చరిక! ఈ ప్రమాదాల్లో.. ప్రాణనష్టం లేదు. కానీ.. ప్రమాదం తీవ్రత ఎక్కువైతే ఏంటి పరిస్థితి? ఈ క్వశ్చన్‌కు.. ఆర్టీసీ నుంచి ఆన్సర్ లేదు.

జనం ప్రాణాలంటే లెక్కలేదా?

Advertisement

ఎలక్ట్రిక్ బస్సులని కొనడంలో ఉన్న ఇంట్రస్ట్.. వాటి బ్యాటరీల మెయింటెనెన్స్, బస్సులో సేఫ్టీ ప్రమాణాలపై లేదు. ఈ వరుస ప్రమాదాలు చూశాక.. బ్యాటరీ బస్సుల్లో ఎక్కేందుకు జనం జంకుతున్నారు. అయినాసరే.. ఆర్టీసీ అధికారుల్లో ఎందుకు చలనం రావడం లేదు? ఎలక్ట్రిక్ బస్సుల విషయంలో స్పెషల్ కేర్ ఎందుకు తీసుకోవడం లేదు? జనం ప్రాణాలంటే లెక్కలేదా? అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయ్. పొల్యూషన్ నిర్మూలించాలని.. డీజిల్, పెట్రోల్ వినియోగం తగ్గించాలని.. ఈవీల వైపు టర్న్ అవుతోంది ఆర్టీసీ.

Also Read: కడప స్టీల్ ప్లాంట్.. అప్పుడు జగన్, ఇప్పుడు బాబు.. అసలు ‘క్రెడిట్’ ఎవరిది?

ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలపై రివ్యూ

కానీ, వాటిని ఎలా డీల్ చేయాలో తెలియక లైట్ తీసుకుంటున్నట్లు అనిపిస్తోంది. ఆర్టీసీ అధికారులు.. ఎలక్ట్రిక్ బస్సులను ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వాటి బ్యాటరీ హెల్త్‌ కండీషన్‌ని ఎప్పటికప్పుడు ఎలా అంచనా వేస్తున్నారు? అనే దానిపైనే ఇప్పుడు ఆందోళనంతా! ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణనష్టం లేకపోయినా.. వాటిని లైట్ తీసుకోవద్దనే వార్నింగ్‌లు వినిపిస్తున్నాయ్. ఊహించని ఘోరం జరగకముందే.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే.. అంతులేని విషాదాలు చూడాల్సి వస్తుంది. ఆలస్యం చేయకుండా.. ఎలక్ట్రిక్ బస్సుల బ్యాటరీలపై రివ్యూ చేసి.. మళ్లీ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×