E-Paper
Advertisement

నాడు వివేకా.. నేడు దస్తగిరి.. వైసీపీ ‘రక్త చరిత్ర’పై టీడీపీ పవర్‌ఫుల్ కౌంటర్!

నాడు వివేకా.. నేడు దస్తగిరి..  వైసీపీ ‘రక్త చరిత్ర’పై టీడీపీ పవర్‌ఫుల్ కౌంటర్!
Advertisement

Kadapa: కడప జిల్లాలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై టీడీపీ రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా అలంఖాన్ పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి హత్యోదంతం జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిని మరోసారి చర్చకు వచ్చేలా చేసింది. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది మెుదటి నుంచి ‘హత్య సంస్కృతి’ అని, అధికారం ఉన్నా లేకపోయినా ఆ పార్టీ నేతలు రక్తపాతానికి వెనకాడరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

వైసీపీ నేతల బరితెగింపు 

Advertisement

చంద్రబాబు నాయుడు పాలనలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఉండేదని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పటివీ వైసీపీ నేతలు బరితెగించి దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద దస్తగిరి అనే వ్యక్తిపై తొలుత కత్తిపోట్లతో దాడి చేసి, చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన సమయంలో కూడా వదలకుండా అక్కడే మాటువేసి అంతం చేయడం వారి క్రూరత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. ఈ హత్య వెనుక మాజీ డిప్యూటీ మేయర్ ప్రమేయం ఉందన్నిది స్పష్టంగా కనిపిస్తోందని, ఇందుకు సంబంధించిన ఆధాారాలను కూడా పోలీసులు సేకరించారని ఆయన పేర్కొన్నారు.

కడప జిల్లాలో భారీ ఎత్తున భూ ఆక్రమాలు

Advertisement

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కడప జిల్లాలో భారీ ఎత్తున భూ అక్రమాలు జరిగాయని శ్రీనివాసులు రెడ్డి ఆరోపించారు. సామాన్యుల భూములను బెదిరించి లాక్కోవడం, విలువైన స్థలాలను తక్కువ ధరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వంటి దౌర్జన్యాలకు వైసీపీ నేతలు పాల్పడ్డారని మండిపడ్డారు. భూ లావాదేవీల్లో తలెత్తిన విభేదాల వల్లే  ఇప్పుడు పెద్ద దస్తగిరిని హత్య చేశారని ఆయన వివరించారు. సొంత పార్టీ నేతల మధ్య ఉన్న భూ తగదాలే ఈ రక్తపాతానికి కారణమని, చివరకు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా ఇలాగే హత్య చేసి ఎదుటివారిపై బురదజల్లడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు.

శ్రీనివాసులు రెడ్డి డిమాండ్

వైసీపీ అరాచకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహించే పార్టీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు సూత్రధారులను పోలీసులు పారదర్శకంగా విచారించి కఠినంగా శిక్షించాలని శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. కడప గడ్డపై ఫ్యాక్టన్ నీడలు తొలగిపోయి, సామాన్యుడికి రక్షణ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Also Read: సొంత గూటిలోనే సీటు లేదు.. మాపై విమర్శలా? హరీష్‌రావుపై తుమ్మల కామెంట్స్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×