E-Paper
Advertisement

Amaravati: బెంగుళూరు నుంచి లోటస్‌‌పాండ్‌కు మకాం! వారానికి ఒకసారి తాడేపల్లికి జగన్, మరి కోర్టు మాటేంటి?

Amaravati: బెంగుళూరు నుంచి లోటస్‌‌పాండ్‌కు మకాం! వారానికి ఒకసారి తాడేపల్లికి జగన్,  మరి కోర్టు మాటేంటి?
Advertisement

Amaravati: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మకాం మార్చబోతున్నారా? బెంగుళూరు నుంచి లోటస్‌ పాండ్ షిఫ్ట్ అవుతున్నారా? ఉన్నట్లుండి ఈ మార్పు వెనుక కారణమేంటి? జ్యోతిష్యుల సలహాతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారా? తాడేపల్లి ప్యాలెస్ కలిసి రాలేదా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

బెంగుళూరు నుంచి లోటస్‌‌పాండ్‌కు జగన్ మకాం!

Advertisement

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు పూర్తి కావడంతో యాక్టివ్ మోడ్‌లోకి రావాలని జగన్ డిసైడ్ అయ్యారట. చీటికి మాటికీ బెంగుళూరు వెళ్లిపోవడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఇబ్బందిగా మారిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యలహంక నుంచి లోటస్‌పాండ్ మారాలని డిసైట్ అయినట్టు వైసీపీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.

ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి.  వైసీపీ అధికారంలోకి రాకముందు లోటస్‌పాండ్ నుంచి వ్యవహారాలను నడిపారు. 2019 ఎన్నికలకు ముందు వ్యవహారాలను అక్కడి నుంచే నడిపారు. అంతేకాదు నిత్యం మీడియాలో ఆయన గురించి రకరకాల వార్తలు వచ్చాయి. దీంతో వైసీపీకి జనాల్లో ఒక్కసారి వేవ్ రావడం మొదలైంది.  వైసీపీ గెలవడం ఈజీ అయ్యిందట.

Advertisement

వారానికి ఒకసారి తాడేపల్లికి జగన్, జ్యోతిష్యుల సలహా మేరకే?

మరొక వెర్షన్‌కి వెళ్దాం.. జ్యోతిష్యులు కూడా తాడేపల్లి ప్యాలెస్ కంటే లోటస్‌పాండ్ కలిసి వస్తుందని  చెప్పారట. హైదరాబాద్‌లో ఉండడం నిత్యం వార్తల్లో నిలుస్తారని, గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం అదే విధంగా రాజకీయాలు నడిపారని అంటున్నారు.

ఇంకోవైపు వెర్షన్‌కి వద్దాం.. ఇటీవలకాలంలో విజయమ్మ ఫ్యామిలీలో ఆస్తుల విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకానొక దశలో ఆమె మీడియా ముందుకొచ్చారు. జరిగిన విషయాలను బయటపెట్టారు. ఇలాంటి పరిస్థితి లోటస్‌పాండ్‌కు దూరంగా ఉంటే చేజారిపోతుందని భావించిన అధినేత ఈ స్కెచ్ వేసినట్టు వైసీపీలో కొందరు నేతలు చెబుతున్నారు.

ALSO READ:  క‌విత కొత్త పార్టీలో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ అమ‌లు! పార్టీలో ప‌ద‌వులు కూడా!

వైసీపీ అధినేతకు హైదరాబాద్‌లో ఉండడం పెద్ద సమస్య కాదు. కాకపోతే తన కేసుల విషయంలో న్యాయస్థానాలకు వెళ్లాల్సి వస్తుందన్నది ఆయన భయం. దీనివల్ల ఆయన తాడేపల్లి నుంచి బెంగుళూరుకు మకాం మార్చినట్టు చెబుతున్నారు. జరిగిన.. జరగనున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న జగన్, లోటస్‌పాండ్ కు మకాం మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీనివల్ల వార్తల్లో నిలవడమేకాదు.. పార్టీ నేతలకు అందుబాటులో ఉన్నట్లు అవుతుందని అంటున్నారు.  తెలంగాణలో తనను నమ్ముకున్నవారికి సహాయం చేసినట్టు ఉంటుందని అంటున్నారు. మొత్తానికి జగన్ మకాం మారడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకీ మకాం ఎప్పుడు మారబోతున్నారు అన్నదే అసలు ప్రశ్న.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×