E-Paper
Advertisement

JC Prabhakar Reddy : కేతిరెడ్డి Vs జేసీ.. ధర్మవరంలో పొలిటికల్ వార్..

JC Prabhakar Reddy : కేతిరెడ్డి Vs జేసీ.. ధర్మవరంలో పొలిటికల్ వార్..
Advertisement

JC Prabhakar Reddy vs Kethireddy(Political news in AP): ధర్మవరంలో కొన్నిరోజులు పొలిటికల్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యే కేతిరెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. మీ కుటుంబం ఎలా బతికిందో తాను చెబుతానన్నారు. జేసీని చెప్పుతో కొడతానన్న ఎమ్మెల్యే కామెంట్లపై ఘాటుగా రిఫ్లై ఇచ్చారు. కొట్టేందుకు రావాలని సవాల్‌ విసిరారు.

ఇటీవల ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పెద్దారెడ్డిలపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వెంకట్రామిరెడ్డి తీవ్రంగా స్పందించారు. చెప్పుతో కొడతామంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి మరోసారి స్పందించారు. కేతిరెడ్డి వాళ్ల తాత చనిపోతే శవాన్ని తీసుకెళ్లే ధైర్యం చేయలేకపోయారని విమర్శించారు. చల్లా సుబ్బరాయుడు సహాయం చేయకపోతే శవాన్ని తీసుకెళ్లలేని పరిస్థితిలో ఉన్నారని గుర్తు చేశారు.కేతిరెడ్డి వాళ్ల చిన్నాన్న పెద్దారెడ్డి పేద రైతులకు దక్కాల్సిన పంటల బీమా సొమ్మును కొట్టేశారని మరోసారి ఆరోపించారు. వెళ్లి ఆయనను చెప్పుతో కొట్టాలని సవాల్ చేశారు.

Advertisement

కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లండన్‌ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేశారని జేసీ అన్నారు. కానీ ఇక్కడ గొప్పలు చెబుతున్నారని సెటైర్లు వేశారు. ఇప్పటికే ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల నుంచి కేతిరెడ్డి ఫ్యామిలీ బాధితులు ఆధారాలు ఇస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని తెలిపారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×