E-Paper
Advertisement

Pawan Kalyan : వాలంటీర్లపై కామెంట్స్.. పవన్‌ కు మహిళా కమిషన్‌ నోటీసులు..

Pawan Kalyan : వాలంటీర్లపై కామెంట్స్.. పవన్‌ కు మహిళా కమిషన్‌ నోటీసులు..
Advertisement

Pawan Kalyan today news(AP latest news) : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఏలూరులో వాలంటీర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఏపీ చాలామంది మహిళలు కనిపించకుండా పోతున్నారన్న ఆరోపణలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వివరణ ఇవ్వకపోతే క్షమాపణ చెప్పాలని కోరింది.

ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారని ఏ కేంద్ర నిఘా వ్యవస్థ చెప్పిందో సమాచారం ఇవ్వాలని పవన్ ను మహిళా కమిషన్ కోరింది. తప్పిపోయిన మహిళల వివరాలు ఇవ్వాలని నోటీసుల్లోపేర్కొంది. ఆ వివరాలు తెలిపిన కేంద్ర అధికారి ఎవరు? అని ప్రశ్నించింది.

Advertisement

రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణమని ఏలూరు సభలో పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలపై తమకు ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ-మెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారని వెల్లడించారు. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్లకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అనుమానం కలిగిస్తున్నాయని అన్నారు. 30 వేల మంది మహిళల మిస్సింగ్‌ కేసులపై లెక్క చెప్పాలని కోరారు.

మరోవైపు పవన్ వ్యాఖ్యలను ఖండిస్తూ వాలంటీర్లు నిరసనకు దిగారు. తమపై నిరాధార ఆరోపణలు చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వెంటనే పవన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×