E-Paper
Advertisement

JanaSena: ఉప్మా పాలిటిక్స్.. బడ్జెట్ పద్మనాభంకు ఇచ్చిపడేసిన జనసైన్యం..

JanaSena: ఉప్మా పాలిటిక్స్.. బడ్జెట్ పద్మనాభంకు ఇచ్చిపడేసిన జనసైన్యం..
Advertisement

JanaSena party latest updates(AP political news): రాజకీయమంటే ఇదే. చిన్న పాయింట్‌ను పట్టుకుని పెద్దగా లాగడమే. పవన్ టార్గెట్‌గా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి కాపు ఉద్యమానికి ఎంతో సహకరించారని పొగిడారు. జనసేనాని ద్వారంపూడిని తిట్టడాన్ని తప్పుబట్టారు. అక్కడితో మేటర్ క్లోజ్.

కట్ చేస్తే.. మరో సభలో ఉప్మా కథ చెప్పారు పవన్ కల్యాణ్. వైసీపీ వ్యతిరేకులంతా ఐకమత్యంగా ఉండాలనేది.. లేదంటే మళ్లీ వైసీపీనే గెలుస్తుందనేది ఆ ఉప్మా స్టోరీ సారాంశం. ఇంకేం.. ఈ ఉప్మా పాయింట్‌ను వెంటనే తమకు అనుకూలంగా.. ముద్రగడకు కౌంటర్‌గా ఫుల్‌గా వాడేసుకుంటున్నారు జనసైనికులు.

Advertisement

ద్వారంపూడి కాపు ఉద్యమం కోసం ఏం చేశారని.. ఆనాటి కాపు సభలో ఉప్మా పెట్టించింది ఆయనేనా అంటూ విమర్శించారు. అలాగైతే ద్వారంపూడి పెట్టిన ఉప్మా ఖర్చును తిరిగి ఇచ్చేయాలంటూ.. ముద్రగడ పద్మనాభంకు తనవంతుగా రూ.1000 మనీయాడర్ పంపించారు జనసేన నాయకుడు పంతం నానాజి. ఆ మాత్రం హింట్ ఇస్తే చాలని.. ఇక చెలరేగిపోయారు కాకినాడ జనసైనికులు.

పవన్ ఫ్యాన్స్ పోస్టాఫీసు ముందు క్యూ కట్టారు. ఎందుకంటే.. ముద్రగడకు ఉప్మా డబ్బులు తిరిగి ఇచ్చేసేందుకు. వరుసబెట్టి పద్మనాభంకు తమకు తోచినంత మనీయాడర్ చేశారు. మా డబ్బులన్నీ తీసుకొని.. కాపు ఉద్యమం కోసం ద్వారంపూడి చేసిన ఆర్థిక సాయాన్ని తిరిగిచ్చేయమని ముద్రగడకు సూచించారు.

Advertisement

జనసైనికుల ఈ ఎత్తగడ సూపర్బ్‌గా వర్కవుట్ అయిందని అంటున్నారు. పవన్.. కాకినాడ ఎమ్మెల్యేను తిట్టడం.. జనసేనానిని తప్పుబడుతూ ముద్రగడ లేఖ రాయడం.. ద్వారంపూడి ఆర్థిక సాయం చేశాడని చెప్పడం.. పవన్ ఉప్మా కథ వినిపించడం.. జనసైనికులు ఉప్మా డబ్బులు మనీయాడర్ చేయడం.. అబ్బో కాకినాడలో రంజుగా సాగుతోంది ఉప్మా పాలిటిక్స్.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×