E-Paper
Advertisement

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు
Advertisement

Janasena X Account: జనసేన పార్టీ అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) అకౌంట్ హ్యాక్ అయింది. శనివారం రాత్రి నుంచి జనసేన ఎక్స్ ఖాతా నిలిచిపోయింది. ఈ అకౌంట్ లో షేర్ మార్కెట్ కు సంబంధించిన పోస్టులు కనిపిస్తున్నాయి. సైబర్ దాడిని నియంత్రించేందుకు పార్టీ సోషల్ మీడియా విభాగం పనిచేస్తుంది. గుర్తు తెలియని సైబర్ నేరగాళ్లు జనసేన ఎక్స్ ఖాతాను నియంత్రణలోకి తీసుకున్నారు. ఆదివారం ఉదయం వరకు ఖాతా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

జనసేన లోగో, కవర్ పేజీ తొలగింపు

డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా పర్యటన ఫొటోలు, సమాచారాన్ని జనసేన శనివారం పోస్టు చేసింది. ఈ పోస్టు తర్వాత ఎక్స్ ఖాతాలో వేరే పోస్టులు వస్తున్నాయి. అధికారిక ఖాతా లోగో, కవర్ పేజ్ తొలగించిన సైబర్ కేటుగాళ్లు.. వేరే పోస్టులు పెడుతున్నారు. హ్యాకర్లు ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్స్ కు సంబంధించిన పోస్టులను రీట్వీట్ చేస్తున్నారు. దీంతో జనసేన మద్దతుదారులు ఆందోళన చెందుతున్నారు. సైబర్ దాడిపై జనసేన అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

పునరుద్ధరణకు ప్రయత్నాలు

Advertisement

ఎక్స్ ఖాతా హ్యాకింగ్‌ కు గురవ్వడంతో జనసేన నాయకత్వం అప్రమత్తమైంది. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. హ్యాకర్‌ల నుంచి ఖాతాను తిరిగి పొందేందుకు పార్టీ సాంకేతిక బృందం ప్రయత్నిస్తునట్లు సమాచారం. ఈ వ్యవహారంపై జనసేన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో చర్చ మొదలైంది. పార్టీ ఎక్స్ ఖాతా హ్యాకింగ్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

Also Read: Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×