// // Samsung Galaxy A56 5G: మార్కెట్లోకి కొత్త ఫోన్.. ఫీచర్లు, ధర ఇలా.. -->
E-Paper
Advertisement

Samsung Galaxy A56 5G: మార్కెట్లో దిగిన ఈ ఫోన్ ఫీచర్స్ తెలిస్తే.. ఇతర బ్రాండ్లు షేక్ అవ్వాల్సిందే!

Samsung Galaxy A56 5G: మార్కెట్లో దిగిన ఈ ఫోన్ ఫీచర్స్ తెలిస్తే.. ఇతర బ్రాండ్లు షేక్ అవ్వాల్సిందే!
Advertisement

Samsung Galaxy A56 5G: కొంతమందికి స్మార్ట్‌ఫోన్‌లు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంతోనే మార్కెట్‌లోకి ఏ కొత్త ఫోన్ వచ్చినా వెంటనే కొనేస్తుంటారు. అలాంటి వాళ్లు కొత్త ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉంటే.. ప్రీమియం ఫీచర్లతో ‌శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయ్యింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మన్నికైన డిజైన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, ఆరేళ్ల అప్‌డేట్స్, లాంగ్ టైమ్ 5000mAh బ్యాటరీతో లభిస్తోంది. ఈ ఫోన్‌‌ను అమెజాన్ లిమిటెడ్ డీల్‌లో రూ. 7వేల తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

ఫీచర్లు, ధర వివరాలు చూస్తే..

శాంసంగ్ గెలాక్సీ A56 5G స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ ప్లస్ 256GB స్టోరేజ్ వేరియంట్‌తో లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 48,999. అయితే, అమెజాన్ లిమిటెడ్ టైమ్ డీల్‌లో 14% ధర తగ్గింపు తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ. 41,999 ధరకే లభిస్తోంది. దీంతో మీరు రూ. 7000 వరకు ఆదా చేసుకోవచ్చు. మీ వద్ద HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్నట్లయితే.. రూ. 3,500 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

అదిరేలా డిజైన్:

Advertisement

శాంసంగ్ గెలాక్సీ A56 5G ఫోన్.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే‌తో వస్తుంది. ఈ ఫోన్ 1900 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A56 5G ఫోన్ ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌వర్క్ గత వెర్షన్‌తో పోలిస్తే ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కలిగి ఉంది. డెస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కొరకు IP67 రేటింగ్‌ కూడా పొందింది. ఇది అవ్‌సామ్ గ్రాఫైట్, అవ్‌సామ్ లైట్ గ్రే, అవ్‌సామ్ ఆలివ్, అవ్‌సామ్ పింక్ కలర్లలో అందుబాటులో ఉంది.

మెరుగైన నైట్ ఫొటోగ్రఫీ:

ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌‌ను కలిగి ఉంది. స్టేబుల్ షాట్‌ల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50MP ప్రైమరీ సెన్సార్, 120-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. అలాగే, ఫ్రంట్ సైడ్ 4K వీడియోలను రికార్డ్ చేయగల 12MP సెల్ఫీ కెమెరా ఉంది. తక్కువ లైటింగ్‌తో క్లియర్ ఫొటోల కోసం ఫోన్ మెరుగైన నైట్ ఫొటోగ్రఫీని కూడా అందిస్తుంది.

పిచ్చెక్కించే ఏఐ ఫీచర్లు:

Advertisement

ఈ ఫోన్ ఎక్సినోస్ 1580 చిప్‌సెట్‌ కలిగి ఉంది. 6GB, 8GB లేదా 12GB LPDDR5 ర్యామ్, 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజ్‌తో లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ A56 5G ఫోన్ 6 జనరేషన్ OS అప్‌గ్రేడ్‌లు, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందిస్తుంది. బాక్స్ వెలుపల వన్ యూఐ7తో ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సర్కిల్ టు సెర్చ్, ఆబ్జెక్ట్ ఎరేజర్, ఇన్‌స్టంట్ స్లో-మోషన్ బెస్ట్ ఫేస్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 5000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేసిన తర్వాత రోజంతా వాడుకోవచ్చు. 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరగా ఛార్జ్ చేయొచ్చు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×