E-Paper
Advertisement

Jahnavi Missing Case: జాహ్నవి మిస్సింగ్ కేసు.. పోలీసులు కీలక ప్రకటన, ఆచూకీ చెబితే లక్ష బహుమతి

Jahnavi Missing Case: జాహ్నవి మిస్సింగ్ కేసు.. పోలీసులు కీలక ప్రకటన, ఆచూకీ చెబితే లక్ష బహుమతి
Advertisement

Jahnavi Missing Case: రెండేళ్ల చిన్నారి జాహ్నవి అదృశ్యమై దాదాపు నెల రోజులు కావస్తోంది.  ఐనప్పటికీ ఆచూకీ లభించలేదు. డజను ప్రత్యేక బృందాలు గాలించినా ఎలాంటి ఫలితం దక్కలేదు. మరోవైపు పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు. చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి లక్ష నగదు బహుమతి ప్రకటించారు.

కాకినాడ జిల్లాలో జాహ్నవి మిస్సింగ్ కేసు

Advertisement

కాకినాడ జిల్లా తునిలోని సీహెచ్ ఆగ్రహానికి చెందిన 26 రోజుల కిందట అదృశ్యమైంది రెండేళ్ల చిన్నారి జాహ్నవి. ఇప్పటికీ చిన్నారి కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. ఓ వైపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. మరోవైపు డ్రోన్ల సాయంతో ముమ్మరం గాలింపు చేపట్టారు. కనీసం పాప జాడ కనిపించలేదు. తల్లిదండ్రులు మాత్రం కూతురు కనిపించలేదని అల్లాడిపోతున్నారు.

అదృశ్యమై 26 రోజులు గడిచినా ఎలాంటి జాడ కనిపించలేదు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. దాదాపు 12 బృందాలు గాలింపు చేపట్టాయి కూడా. ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో తుని పోలీసులు కీలక ప్రకటన చేశారు. చిన్నారి ఆచూకీ చెప్పినవారికి లక్ష నగదు బహుమతి ఇస్తామన్నారు.

Advertisement

పోలీసులు కీలక ప్రకటన, ఆచూకీ చెబితే లక్ష బహుమతి

సమాచారం అందజేసినవారి పేరు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. సుంకర జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి ఫోటోతో ప్రకటన ఇచ్చారు. కేవలం సోషల్ మీడియాలోనే కాదు.. గోడ పత్రిక తుని మొత్తమంతా అంటించారు. కాకినాడ, రాజమండ్రి, విశాఖ జిల్లాల్లో గోడ పత్రికలు వీటిని అతికించారు. ఎవరికైనా తెలిస్తే 9440796508, 9440796531, 9440796573కు సమాచారం ఇవ్వాలని తుని రూరల్‌ సీఐ చెన్నకేశవరావు తెలియజేశారు.

చిన్నారి జాహ్నవి కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ క్షేమంగా తిరిగి రావాలని వారు చేయని పూజలు లేవు. ఎన్నో దేవుళ్లకు సైతం మొక్కుకున్నారు. జూన్ 6న మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న జాహ్నవి కనిపించకుండా పోయింది. పాపతో పాటు పెంపుడు శునకం అదృశ్యమైంది.

ALSO READ: SIR ప్రక్రియపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై రుసరుస, మావిగన్ పై కీలక వ్యాఖ్యలు

కొన్ని రోజులకు ఆ శునకం ఇంటికి చేరినప్పటికీ, పాప రాలేదు. దీంతో తల్లిదండ్రుల్లో టెన్షన్ పెరిగిపోయింది. చివరకు ఇంటికి వచ్చిన శునకం మృతి చెందింది. ఆ శునకం ఊరిలో ప్రధాన రహదారిపై తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. కానీ జాహ్నవి ఎటువైపు వెళ్లిందనే దానిపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ ప్రకటన చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×