E-Paper
Advertisement

Janasena vs BJP: జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉందా..? వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయా..?

Janasena vs BJP: జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉందా..? వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయా..?
Advertisement

Janasena vs BJP(AP political news): ఏపీలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉందా..? వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయా..? అంత తేలిగ్గా సమాధానం దొరికే ప్రశ్నలు కావివి. బీజేపీతో పొత్తు ఉందని చెబుతున్న జనసేనాని.. ఆ పార్టీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. ఇటు జనసేన కార్యక్రమాల్లో ఎక్కడా బీజేపీ కనిపించదు. కానీ రెండు పార్టీలు కలిసే జర్నీ చేస్తున్నట్లు చెబుతారు.

లోకల్ లీడర్లను పట్టించుకోని పవన్.. ఢిల్లీలోని కాషాయ పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతారు. స్థానిక నేతలకు తెలియకుండానే.. పొత్తుపై ప్రకటన చేస్తారు. దీంతో స్థానికంగా రెండు పార్టీల మధ్య సఖ్యత కరువవుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో.. తిరుమల శ్రీవారి ఆయంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధుల అంశం.. రెండు పార్టీల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది.

Advertisement

వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా.. ప్రతిపక్ష ఓట్లు ఒక్కచోటికి చేర్చడమే లక్ష్యంగా.. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు అంశంపై.. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్.. భారీ కసరత్తే చేశారు. ఢిల్లీకి వెళ్లి మంతనాలు జరిపాక.. రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని.. స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. అయినప్పటికీ.. స్థానిక బీజేపీ నాయకత్వం విషయంలో పవన్ స్టాండ్ మాత్రం మారడం లేదు. జనసేన సింగిల్ గానే ప్రచారం చేస్తూ వెళ్తోంది. వారాహి యాత్రలో కూడా ఎక్కడా బీజేపీ ప్రస్తావన రానేలేదు. దీంతో పైకి పొత్తు అని చెప్పుకుంటున్నా.. ఎవరి దారి వారిదే. ఎవరి లెక్కలు వారివే.

ఈ సమయంలో శ్రీవాణి ట్రస్ట్ నిధుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలతో.. రెండు పార్టీల మధ్య సరికొత్త వార్ మొదలైంది. ఈ నేపథ్యంలో.. జనసేనాని వ్యాఖ్యలను బీజేపీ డైరెక్ట్ అటాక్ చేస్తోంది. టీటీడీ విషయంలో బీజేపీకి ఉన్న కమిట్ మెంట్.. ఏ పార్టీకి లేదంటూ కౌంటర్ ఇస్తున్నారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×