E-Paper
Advertisement

Toll Scam: చెట్టుకు సీసీ కెమెరా పెట్టి.. సినిమా రేంజ్‌లో అక్రమ టోల్ దోపిడి..!

Toll Scam: చెట్టుకు సీసీ కెమెరా పెట్టి.. సినిమా రేంజ్‌లో అక్రమ టోల్ దోపిడి..!
Advertisement

Toll Scam: నెల్లూరులో విచిత్ర టోల్ దోపిడి జరుగుతుంది. ఓ చెట్టుకు సిసి కెమెరాలు అమర్చి ఓ వ్యక్తి పెట్టేసాడు. అక్కడ రోడ్డు మీద వెల్లిపోయే పెద్ద పెద్ద గ్రావెల్ లారీలు ఆపి ఓక్కోదానికి 250 నుంచి 400 రూపాయలవరకు వసూలు చేస్తున్నాడు. ఎందుకు అని అడిగితే నెల్లూరు పెద్దాయన ఆర్డర్స్ ఇచ్చాడు ఇక్కడ కట్టాలని అంటాడు. అసలు ఆ నెల్లూరు పెద్దయన ఎవరూ అంటే ఆయనెవరో మాకు తెలియదు అని అంటారు. డబ్బులు కడతాము టోల్ రసీదులు ఉన్నాయా అంటే ఆయన అవి కూడా లేవంటాడు. పోనీ ఐడి కార్డులు అడిగితే బూత్ మూసేసి వెళ్లి పోతున్నాడు. ఇదంతా చూస్తుంటే గందరగోళంగా సినిమాలో బాస్ టోల్ మోసంలా ఉంది అక్కడి పరిస్థితి.

Also Read: BJP Strategy: త్వరలో జిల్లాకో స్పోక్స్ పర్సన్ నియామకం: రాంచందర్ రావు

మాకు తెలియదంటున్న అధికారులు..

Advertisement

అయితే ఈ దందాపై కొందరు వ్యక్తులు స్ధానిక ఎమ్మార్వోకి తెలియ చేసారు. దీంతో ఎమ్మార్వోని అడిగితే మాకు ఆయన ఎవరో తెలియదని సమాదానం చెప్తున్నారు. ఇ దందా పై పోలీసులకు తెలియ చేస్తే వారు కూడా మాకు తెలియదని అంటున్నారు. అసలు కలెక్షన్ చేసింది ఎవరు అనేది మాత్రం అక్కడ ఎవరికి అంతు చిక్కడం లేదు. టోల్ కలెక్షన్లు మాత్రం ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దీంతో అక్కడ రాకపోకలు చూస్తుంటే పక్కా ఓ పెద్దాయన అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అక్కడి స్థానికులు అనుకుంటున్నారు. దీంతో నిత్యం ఇలా వసూలు చేయడం వలన అక్కడి స్థానిక వాహసాదారుల జేబుకు చిల్లులు పెడుతున్నారని దీనిపై ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించి ఈ దోపిడికి అడ్డుకట్టవేయాలని అక్కడి భాదితులు వాపోయారు. నిత్యం ఈ దందాతో రాకపోకలు సాగించడం కష్టంగా మారిదని తెలిపారు.

Also Read: Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×