E-Paper
Advertisement

AP News: కృష్ణుడి విగ్రహం టచ్ చేస్తే ఊరుకోం.. మంగళగిరిలో హై టెన్షన్

AP News: కృష్ణుడి విగ్రహం టచ్ చేస్తే ఊరుకోం.. మంగళగిరిలో హై టెన్షన్
Advertisement

AP News: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, మంగళగిరి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అక్కడి కూడలిలో ప్రతిష్ఠించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విగ్రహాన్ని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగడంతో, ఈ చర్యను అడ్డుకునేందుకు యాదవుల సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ విగ్రహం తొలగింపు ప్రక్రియ అంతా కోర్టు ఆదేశాల మేరకే జరుగుతుందన్నారు. అంతేకాకుండా మంగళగిరిలోని కృష్ణుడి విగ్రహం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దానిని తొలగించాలని కోరుతూ మంగుళూరుకు చెందిన ఓ వ్యక్తి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు, విగ్రహాన్ని తొలగించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల అమలులో భాగంగానే, మున్సిపల్ సిబ్బంది విగ్రహం తొలగింపు పనులను ప్రారంభించారు.

Advertisement

అయితే కోర్టు ఆదేశాలు వచ్చినప్పటికీ, స్థానికుల అభ్యంతరాల దృష్ట్యా ఈ విగ్రహాన్ని తొలగించడం మున్సిపల్ సిబ్బందికి అంత సులభం కాలేదు. విగ్రహం తొలగింపు పనులు ప్రారంభించిన వెంటనే, స్థానికులు, యాదవ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వారు మున్సిపల్ సిబ్బందిని అడ్డుకుని, నిరసన తెలియజేశారు.

ఈ విగ్రహంపై తమకు ఎంతో భక్తి, విశ్వాసం ఉన్నాయని యాదవ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విగ్రహాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదంటూ వారు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. కృష్ణుడి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించడానికి వీలు లేదంటూ నినాదాలు చేస్తూ, మున్సిపల్ సిబ్బంది చుట్టూ గుమిగూడారు.

Advertisement

Also Read: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద పడి 11 ఏళ్ల బాలుడు మృతి.

దీంతో అక్కడి ప్రాంతం అంతా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళనకారులను శాంతింపజేయడానికి, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, ఆందోళనకారులు తమ డిమాండ్‌పై పట్టుబట్టడంతో, ఇందిరానగర్ ప్రాంతంలో తీవ్ర తోపులాట, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×