E-Paper
Advertisement

Dog Attack: పిచ్చి కుక్క స్వైర విహారం, 36 మందిపై దాడి, ఆసుపత్రికి బాధితులు, బెంబేలెత్తిపోయిన ప్రజలు

Dog Attack: పిచ్చి కుక్క స్వైర విహారం,  36 మందిపై దాడి, ఆసుపత్రికి బాధితులు, బెంబేలెత్తిపోయిన ప్రజలు
Advertisement

Dog Attack: వీధి కుక్కల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా, ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఓ వైపు మనుషులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు పిచ్చి కుక్కలు రెచ్చిపోతున్నాయి. తాజాగా ఓ పిచ్చి కుక్క.. 36 మందిపై దాడి చేసింది. చివరకు ఓ బాధితుడు దాన్ని చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. ఎక్కడ.. ఏంటి?

రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్క స్వైర విహారం

Advertisement

Advertisement

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో ఈ దారుణం వెలుగుచూసింది. ఓ పిచ్చికుక్క 36 మందిపై దాడి చేసింది. ప్రధాన రహదారిపై రద్దీగా ఉండే ప్రదేశంలో కనిపించిన వారందరిపై దాడి చేసింది. చివరకు ఓ బాధితుడు ఆ కుక్కను చంపేశాడు. గాయపడిన వారంతా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లారు.

ఒక్కసారి అంతమందిని దాడి చేయడంపై వైద్యులు షాకయ్యారు. కుక్క కాటుకు గురైన 36 మందికి చికిత్స అందించామని తెలిపారు. ఉన్నట్లుండి పిచ్చి కుక్క ఈ స్థాయిలో దాడి చేయడంపై స్థానికులు బెంబేలెత్తిపోయారు.  రోడ్లపై వెళ్లే కుక్కలను చూసి ఆ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. 

36 మందిపై దాడి.. ఆసుపత్రికి బాధితులు

కుక్కల దాడి ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. న్యాయస్థానాలు ఆదేశాలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నాయి. అయినా దాడుల ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా హైదరాబాద్ శివారులో ఓ మూగబాలుడిపై కుక్క దాడి చేసింది.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ విషయం తెలిసింది. వెంటనే అధికారులను ఆదేశించారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసారి ఆమన్‌గల్ పట్టణంలో ఏకంగా పిచ్చికుక్క వంతైంది.  కుక్కల పెరుగుదలను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రాంతవాసులు కోరుతున్నారు.

ALSO READ: ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×