E-Paper
Advertisement

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement

Visakha Accident: విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. అతి వేగంగా వస్తున్న ఓ కారు.. లారీ ఢీ కొట్టింది. స్పాట్‌లో నలుగురు మృత్యువాతపడ్డారు. మరొకర తీవ్రంగా గాయపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం-విశాఖ జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారి సమీపంలో ఈ ఘటన జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండ నుంచి కారులో శ్రీకాకుళం జిల్లాకు ఓ ఫ్యామిలీ వెళ్తోంది. టెక్కలిలో ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తోంది.

Advertisement

లారీని ఢీ కొట్టిన కారు-అయితే కారు ఆనందపురం సమీపంలోని గండిగుండం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని అదుపుతప్పి బలంగా లారీని ఢీ కొట్టింది. ఘటన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. కారు డ్రైవర్‌ సహా నలుగురు స్పాట్‌లో మృతి చెందారు. నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ చంద్రశేఖర్‌ గాయపడినట్టు తెలుస్తోంది.

స్పాట్‌లో నలుగురు మృతి-ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఎమ్మెల్యే పీఏను చికిత్స కోసం విశాఖలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో చంద్రశేఖర్‌ కొడుకు ఉన్నట్ల్లు తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు,  వివరాలు సేకరించారు.  చంద్రశేఖర్ కుమారుడు భవాని శంకర్ మృతి చెందాడు.

Advertisement

ALSO READ: ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

మృతులు  వినుకొండ నియోజకవర్గానికి చెందినవారు.  ఈ ఘటనలో పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి భవాని శంకర్ మృతి చెందారు. నరసరావుపేటకు చెందిన డ్రైవర్ శ్రీను చనిపోయినవారిలో ఉన్నాడు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.  ప్రమాదంలో చనిపోయిన మృతులు తనకు అత్యంత ఆప్తులని చెప్పారు.

.

 

 

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×