E-Paper
Advertisement

రైల్వేకోడూరులో నాకు రక్షణ లేదు.. ప్రాణహాని ఉంది, ఎమ్మెల్యే శ్రీధర్ పై హర్షవీణ సంచలన ఫిర్యాదు

రైల్వేకోడూరులో నాకు రక్షణ లేదు.. ప్రాణహాని ఉంది, ఎమ్మెల్యే శ్రీధర్ పై హర్షవీణ సంచలన ఫిర్యాదు
Advertisement

రైల్వే కోడూరు స్థానిక రాజకీయాల్లో సంచలనం రేపుతూ బాధితురాలు హర్షవీణ పోలీసులను ఆశ్రయించారు. తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ఆమె ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు టీడీపీ నేత రూపానందరెడ్డి అలాగే నాగేంద్ర పేర్లను ఆమె ప్రధానంగా ప్రస్తావించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులకు విన్నవించుకున్నారు. న్యాయవాదితో కలిసి పోలీసులకు హర్షవీణ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాగేంద్రతోపాటు మరికొందరిపైనా పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులను నమోదు చేసినట్టు తెలుస్తోంది.

కోడూరు నియోజకవర్గంలో తనకు రక్షణ కరువైందని హర్షవీణ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా వేధింపులు పెరిగాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ కుటుంబం తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతోందని తెలిపారు. పోలీసులు సైతం తమకు రక్షణ కల్పించడంలో భాగంగా ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు ఆమె వెల్లడించారు. ఒక సామాన్యురాలిగా తనకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

కేవలం తన కుటుంబానికే కాకుండా తన తరఫున వాదిస్తున్న లాయర్ కుటుంబానికి కూడా ముప్పు పొంచి ఉందని హర్షవీణ ఆందోళన చెందారు. రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడంతో తమను ఏ క్షణమైనా ఏదైనా చేయవచ్చని ఆమె భయపడుతున్నారు. ఈ వివాదంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు రూపానందరెడ్డి ప్రమేయం ఉందని ఆమె స్పష్టంగా ఆరోపించారు. తనకు ఏ హాని జరిగినా వీరిద్దరే బాధ్యత వహిస్తారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తమకు వీరిద్దరు తప్ప మరెవరు శత్రువులు లేరని హర్షవీణ చెప్పారు. వ్యక్తిగత కక్షలతోనే తమను టార్గెట్ చేస్తున్నారని ఆమె వాపోయారు. ప్రజాప్రతినిధులుగా ఉండి రక్షణ కల్పించాల్సింది పోయి భయభ్రాంతులకు గురి చేయడం తగదని ఆమె విమర్శించారు. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించి తమకు భద్రత కల్పించాలని ఆమె కోరారు.

ALSO READ: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×