E-Paper
Advertisement

పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఒక రోజు ముందుగా పంపిణీ, సీఎం చంద్రబాబు నిర్ణయం వెనుక

పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు.. ఒక రోజు ముందుగా పంపిణీ, సీఎం చంద్రబాబు నిర్ణయం వెనుక
Advertisement

Amaravati: పెన్షన్లదారులకు తీపి కబురు చెప్పింది చంద్రబాబు సర్కార్. వచ్చే నెల పెన్షన్లు ముందుగా పంపిణీ చేసేందుకు సిద్దమైంది. ఆగష్టు ఒకటిన ప్రధాని మోదీ విశాఖ రానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో 11.98 లక్షల మందికి రూ.514.42 కోట్ల నిధులను ముందుగా విడుదల చేయనుంది.

పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు- ఆగష్టు ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాంధ్రకు వస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టును ఆయన ప్రారంభించనున్నారు. ఇందుకోసం చంద్రబాబు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకటో తారీఖు పెన్షన్లు ఇచ్చే రోజు కావడంతో వారు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం.

Advertisement

ఒక రోజు ముందుగా పెన్షన్లు- జూలై 31న పెన్షన్ పంపిణీని పూర్తి చేయాలని నిర్ణయించింది. దీంతో ఈనెల 30, 31వ తేదీల్లో లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వనుంది. ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాల్లో పెన్షన్ల పంపిణీని ముందుగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ముందుగా పెన్షన్ల ఇచ్చే ప్రక్రియను చేపట్టనుంది.

ఆరు జిల్లాల అధికారులకు ఆదేశాలు- ఆరు జిల్లాల్లో 11.98 లక్షల మందికి రూ.514.42 కోట్ల పంపిణీ చేయనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ ఆంక్షలు, రవాణా పరిమితులు ఉండే అవకాశం ఉంది. వృద్ధులు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పెన్షన్ పంపిణీ సజావుగా సాగేలా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.

Advertisement

అవసరమైన నగదు ముందుగా సిద్ధం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు పంపిణీపై నిరంతరం సమీక్షలు చేస్తున్నారు.

ఆగష్టు ఒకటిన భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం-ఆధునిక హంగులతో భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మించింది జీఎంఆర్ సంస్థ. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. భారీ బహిరంగ సభ, సాంస్కృతిక కార్యక్రమాలతో  వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా తీర్చిదిద్దారు. భవిష్యత్తులో 4 కోట్ల మంది ప్రయాణం చేసేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు.

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్.. పాఠశాలలు, కాలేజీలకు సెలవు, ఏపీలో ఆ నిర్ణయం ఏంటి?

అందుకు అనువుగా పొడవైన రన్‌వేతో భారీ విమానాలు సులభంగా దిగేలా నిర్మాణం పూర్తి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రకు మహర్దశ పట్టనుంది. దేశ విదేశాలతో నేరుగా కనెక్టివిటీ పెరగనుంది. దీని ద్వారా పారిశ్రామిక-పర్యాటక రంగాల్లో పెట్టుబడులు వచ్చే అవకాశముందని అంచనా వేస్తోంది. ఫలితంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×