E-Paper
Advertisement

నల్లగొండలో వైజాగ్ కాలనీ కనువిందు.. సాగర్ బ్యాక్‌ వాటర్స్ నేచర్ మ్యాజిక్ చూసొద్దాం రండి!

నల్లగొండలో వైజాగ్ కాలనీ కనువిందు.. సాగర్ బ్యాక్‌ వాటర్స్ నేచర్ మ్యాజిక్ చూసొద్దాం రండి!
Advertisement

Vizag Colony Nalgonda: హైదరాబాద్‌ కు దగ్గరలోనే ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా? కాంక్రీట్ జంగల్ కు కాస్త దూరంగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, నల్లగొండ జిల్లాలోని వైజాగ్ కాలనీ ట్రై చేయడం బెస్ట్. భాగ్యనగరానికి సమీపంలో ఇదో అద్భుతమైన పర్యాటక ప్రదేశం. నాగార్జునసాగర్ బ్యాక్‌ వాటర్స్, పచ్చని కొండలు, చిన్న చిన్న దీవులను తలపించే దృశ్యాలు, బోటింగ్ తో ఈ ప్రాంతం సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. ఎక్కువ మందికి ఈ ప్రాంతం గురించి తెలియకపోవడంతో ఇక్కడ పెద్దగా హడావుడి కనిపించదు. అందుకే, ప్రశాంతతను ఆస్వాదించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది.

వైజాగ్ కాలనీ ఎక్కడ ఉందంటే?

వైజాగ్ కాలనీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి సమీపంలో ఉంది. ప్రస్తుతం ఇది నేరేడుగొమ్ము–చందంపేట మండలాల పరిధిలోకి వస్తుంది. హైదరాబాద్ నుంచి సుమారు 130 కిలోమీటర్లు, నల్లగొండ నుంచి దాదాపు 83 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన ప్రాంతం ఉంది. నాగార్జునసాగర్ వెళ్లే మార్గంలో కొద్దిగా లోపలికి వెళ్తే ఈ ప్రకృతి స్వర్గం దర్శనమిస్తుంది. వైజాగ్ కాలనీకి వెళ్లే ప్రయాణమే ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. గిరిజన తండాల మీదుగా వెళ్లే రహదారి, రెండు వైపులా కనిపించే పచ్చని చెట్లు, కొండలు మనసును హాయిగా మారుస్తాయి. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్ద వాతావరణం ప్రతి ఒక్కరికీ కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి. ప్రకృతి ప్రేమికులు, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి ఇదో అద్భుతమైన ప్రదేశం.

ఆకట్టుకునే మినీ ఐల్యాండ్స్  

Advertisement

ఈ ప్రాంతానికి ప్రధాన ఆకర్షణ నాగార్జునసాగర్ బ్యాక్‌ వాటర్స్. విస్తారంగా కనిపించే జల సౌందర్యం, చుట్టూ ఉన్న కొండలు..  అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. నీటి మధ్యలో కనిపించే చిన్న చిన్న భూభాగాలు మినీ ఐల్యాండ్‌ లా కనిపిస్తూ సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తుంది. ఆ దృశ్యాలను ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ రావాలనిపించడం ఖాయం.

హ్యాపీగా జాలీగా బోట్ రైడ్

ఇక్కడ పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. బోటులో ప్రయాణిస్తూ సాగర్ అందాలను దగ్గరగా ఆస్వాదించవచ్చు. నీటిపై ప్రయాణిస్తూ చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు మనసుకు మరపురాని అనుభూతిని కలిగిస్తాయి. రాత్రి బస చేయాలనుకునే వారి కోసం నైట్ క్యాంపింగ్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. నక్షత్రాల వెలుగులో ప్రకృతి మధ్య గడిపే ఆ క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఇక్కడ రోడ్ల వెంట చేపలు విరివిగా లభిస్తాయి. వాటిని అక్కడే కర్రీ, ఫ్రై చేయించుకుని రుచి చూడొచ్చు.

వైజాగ్ కాలనీ అనే పేరు ఎలా వచ్చింది?

Advertisement

వైజాగ్ కాలనీలో ఎక్కువగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తుంటాయి. వీరిలో చాలామంది ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. అందుకే, ఈ ప్రాంతానికి వైజాగ్ కాలనీ అనే పేరు వచ్చింది. చేపల వేటనే జీవనాధారంగా చేసుకుని చిన్న చిన్న గుడిసెల్లో నివసిస్తున్నారు. గ్రామీణ జీవన విధానం, వారి సాదాసీదా జీవితం, ఆతిథ్యం పర్యాటకులకు కొత్త అనుభవాన్ని అందిస్తాయి.

సెలవుల్లో ఎక్కువ దూరం ప్రయాణించకుండా ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలని అనుకునే వారికి వైజాగ్ కాలనీ మంచి డెస్టినేషన్. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఒకరోజు పర్యటనకు వెళ్లినా, వీకెండ్ లో నైట్ క్యాంపింగ్ చేయాలనుకున్నా ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. పచ్చని కొండలు, సాగర్ బ్యాక్‌వాటర్స్, బోటింగ్, ప్రశాంత వాతావరణం, గ్రామీణ జీవన సౌందర్యం అన్నీ కలిసి వైజాగ్ కాలనీని ఒక్కసారైనా సందర్శించాల్సిందే!

Read Also: గంగమ్మ నిత్యం జలాభిషేకం చేసే అద్భుత శివలింగం.. ఈ దృశ్యం చూస్తే మైమరచిపోతారు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×