E-Paper
Advertisement

AP News: బోరు నుంచి బ్లోఅవుట్.. కోనసీమ కడుపులో ఆరని కుంపటి..

AP News: బోరు నుంచి బ్లోఅవుట్.. కోనసీమ కడుపులో ఆరని కుంపటి..
Advertisement
gas blowout

AP News Updates: కోనసీమ కడుపులో గ్యాస్ నిల్వలు దాగుండటం వ్యాపారులకు లాభమైనా.. స్థానికులకు మాత్రమే శాపమే. తరుచూ అగ్నిప్రమాదాలతో పచ్చని పొలాల్లో ఎర్రటి మంటలు ఎగిసిపడుతుంటాయి. ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు. తాజాగా మరోసారి గ్యాస్ బాంబు బ్లోఅవుట్ అయింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్‌ లీక్ కలకలం రేపుతోంది. ఆక్వా చెరువు దగ్గరున్న బోరు నుంచి గ్యాస్‌ లీక్‌ అవుతోంది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయ్. రాజోలు మండలం శివకోటిలోని ఘటన జరిగింది.

Advertisement

ఉదయం ఐదు గంటల నుంచి మంటలు ఎగసిపడుతున్నాయ్. 20 అడుగుల ఎత్తు వరకు మంటలు చెలరేగుతున్నాయి. అగ్నికీలలు అదుపు చేసేందుకు.. ఫైర్ సిబ్బంది, ఓఎన్జీసీ సిబ్బంది.. గంటల తరబడి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఘటన జరిగిన చోట గతంలో గ్యాస్‌ కోసం సెస్మిక్‌ సర్వే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అదే ప్రదేశంలో 2 రోజుల క్రితం ఓ పాత బోరును మరింత లోతుకు తవ్వారు. ఇందువల్లే భూమిలోని గ్యాస్‌ బయటికి వచ్చి ఇలా మంటలు వస్తున్నట్టు అధికారులు అంటున్నారు. భూమిలో నుంచి నిరంతరాయంగా గ్యాస్‌ వస్తుండటంతో.. మంటలు కంట్రోల్ చేయడం సిబ్బందికి కష్టంగా మారింది. ఇంకా మంటలు అదుపులోకి రాకపోవడంతో భయాందోళన చెందుతున్నారు స్థానికులు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×