E-Paper
Advertisement

Congress: ఎన్నికల కాంగ్‌-రేస్.. కమిటీలు, పరిశీలకులతో జోష్..

Congress: ఎన్నికల కాంగ్‌-రేస్.. కమిటీలు, పరిశీలకులతో జోష్..
Advertisement
T Congress

Congress news telangana(TS politics) : తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే పార్టీ శ్రేణులను సంయమనం చేసేందుకు పలు కమిటీలను పునర్ వ్యవస్థీకరించడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించింది.

తెలంగాణ అసెంబ్లీకి ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న వేళ టీపీసీసీ ప్రచార కమిటీని హైకమాండ్ నియమించింది. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ను నియమించిన కాగ్రెస్‌ అధిష్ఠానం.. కో ఛైర్మన్‌గా పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, కన్వీనర్‌గా సయ్యద్‌ అజ్మతుల్లా హుస్సేనీలను అపాయింట్ చేసింది. మరో 37మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీని ప్రకటించింది.

Advertisement

ఇందులో పీసీసీ అధ్యక్షుడితో పాటు సీఎల్పీ నేత, మండలిలో ప్రతిపక్ష నేత, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, జాతీయ ఆఫీస్‌ బేరర్లు, పార్టీకి సంబంధించిన పలు శాఖలు, డీసీసీ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ ఏఐసీసీ జాబితాను విడుదల చేసింది.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. వీరి నియామక ప్రతిపాదనకు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఆయన ప్రకటించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×