E-Paper
Advertisement

Anathapuram News: ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై దాడి.. వైసీపీ నేతల వీరంగం.. అర్థరాత్రి హంగామా..

Anathapuram News: ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై దాడి.. వైసీపీ నేతల వీరంగం.. అర్థరాత్రి హంగామా..
Advertisement

Anathapuram News : అనంతపురం స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో స్టేషన్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది. స్థానిక వైసీపీ కార్పొరేటర్, అనుచరులు ఈ దాడి చేశారు. తమ వాడిని పట్టుకొస్తారా అంటూ నానా గొడవ చేశారు. సెబ్ పోలీసులతో అసహ్యంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడ్డారు.

Advertisement

అక్రమంగా మద్యం అమ్ముతుండగా నవోదయా కాలనీలో గుజ్జల సురేష్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోయారు. మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసులు నమోదు చేస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌పై దాడికి ప్రయత్నించారు. ఘటనలో కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి.

మద్యం అమ్ముతున్న యువకుడిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంలోనే వైసీపీ నేతలు బీభత్సం సృష్టించారు. ఎస్సై మునిస్వామి, కోర్టు కానిస్టేబుల్ శేఖర్, మహిళా కానిస్టేబుల్ రాధమ్మపై దాడి చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే క్రమంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో హంగామా చేశారు. మహిళా కానిస్టేబుల్‌తోనూ దురుసుగా ప్రవర్తించారు. దాడి చేసింది అధికార పార్టీ నేత కావడంతో పోలీసులు సైలెంట్‌గా ఉండిపోయారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×