E-Paper
Advertisement

Tiger Attack: ఏలూరు జిల్లాలో పులి పంజా.. వరుసగా పశువుల మృతితో వణుకుతున్న గ్రామాలు

Tiger Attack: ఏలూరు జిల్లాలో పులి పంజా.. వరుసగా పశువుల మృతితో వణుకుతున్న గ్రామాలు
Advertisement

ఏలూరు జిల్లాలో పెద్దపులి మళ్ళీ పంజా విసిరింది. గత కొన్ని రోజులుగా అటవీ సరిహద్దు గ్రామాల్లో వరుస దాడులకు తెగబడుతూ పశువులను పొట్టనబెట్టుకుంటోంది. కొయ్యలగూడెం, బుట్టాయగూడెం మండలాల్లోని గ్రామాల ప్రజలు ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. పులి సంచారం స్పష్టంగా కనిపిస్తున్నా, అటవీ శాఖ అధికారులు మాత్రం మొద్దునిద్ర వీడటం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వరుస దాడులు – వణుకుతున్న గ్రామాలు..

Advertisement

కొయ్యలగూడెం మండలం మంగదేవిపేట గ్రామంలో ఒక లేగదూడపై దాడి చేసిన పులి, దానిని చంపి తినేసింది. అలాగే, బుట్టాయగూడెం మండలం కోట రామచంద్రపురం పంచాయతీ పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో ఒక గేదెను వేటాడింది. అంతటితో ఆగకుండా, కొయ్యలగూడెం మండలం బిల్లిమిల్లి నుంచి కామయ్యకుంట వెళ్లే దారిలో మరో గేదె దూడను చంపేసింది. ఈ వరుస ఘటనలతో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొలాలకు వెళ్లాలన్నా, పశువులను మేతకు తీసుకెళ్లాలన్నా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అటవీ శాఖ నిర్లక్ష్యంపై విమర్శలు.. 

Advertisement

పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాల్లో కనీస సమాచారం అందించడంలో అటవీ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. పులి ఎక్కడ ఉంది? ఏ దిశగా వెళ్తోంది? అనే విషయాలపై ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు వెనకబడి ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో గస్తీ పెంచాల్సింది పోయి, కేవలం “నష్టపరిహారం వస్తుందిలే” అని బదులివ్వడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటవీ శాఖపై ప్రజల ఆగ్రహం..

‘పశువుల ప్రాణాలు పోతుంటే పట్టించుకోరా? రేపు మనుషులపై దాడి చేసే వరకు వేచి చూస్తారా?’ అంటూ కొయ్యలగూడెం, బుట్టాయిగూడెం మండలాల ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. కేవలం నష్టపరిహారం ఇస్తామని చెప్పడం వల్ల పోయిన పశువులు తిరిగి రావని, అసలు పులిని పట్టుకోవడానికి లేదా జనావాసాల్లోకి రాకుండా చూడటానికి గట్టి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అటవీ శాఖ స్పందించి, పులిని బంధించాలని లేదా సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

ALSO READ: Onion Juice for Hair Regrowth: బట్టతలపై జుట్టు మొలిపించే ఉల్లిపాయ రసం.. ఇంతకీ సైన్స్ ఏం చెబుతోందంటే?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×