E-Paper
Advertisement

Lokesh Kanagaraj: హీరోయిన్ ప్రేమలో డైరెక్టర్.. మైండ్ బ్లోయింగ్ సమాధానం  ఇచ్చిన లోకేష్!

Lokesh Kanagaraj: హీరోయిన్ ప్రేమలో డైరెక్టర్.. మైండ్ బ్లోయింగ్ సమాధానం  ఇచ్చిన లోకేష్!
Advertisement

Lokesh Kanagaraj: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అపజయ మెరుగని దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)ఒకరు. ఇప్పటివరకు ఈయనఆరు సినిమాలకు దర్శకుడుగా పనిచేశారు. ఈ ఆరు సినిమాలు కూడా మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈయన తమిళ హీరోలతో మాత్రమే కాకుండా పాన్ ఇండియా హీరోలను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం లోకేష్ ఒక వైపు దర్శకుడిగా కొనసాగుతూనే మరోవైపు హీరోగా కూడా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

లోకేష్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్..

ప్రస్తుతం ఈయన DC అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాతో పాటు లోకేష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వచ్చింది ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా లోకేష్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది.. ఇటీవల ఈయన ఒక ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఒక రిపోర్టర్ నుంచి లోకేష్ కు వింత ప్రశ్న ఎదురయింది. ఇటీవల కాలంలో రిపోర్టర్స్ అడుగుతున్న ప్రశ్నల కారణంగా సెలబ్రిటీలు ఇబ్బందులు పడుతున్నారు.

హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్నారా..

Advertisement

ఈ నేపథ్యంలోనే రిపోర్టర్ లోకేష్ కనగరాజ్ ను ప్రశ్నిస్తూ.. గత కొంతకాలంగా మీరు ఒక హీరోయిన్  ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగానే మీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు లోకేష్ సమాధానం చెబుతూ లేదు సార్ నాకు ఫ్యామిలీ ఉంది అంటూ చాలా హుందాగా సమాధానం చెప్పారు.. లోకేష్ ఇలాంటి సమాధానం చెప్పినప్పటికీ రిపోర్టర్ వదిలిపెట్టకుండా రెండో ఫ్యామిలీ ఆలోచన లేదా అంటూ ప్రశ్న వేయడంతో వెంటనే లోకేష్ నేను సమాధానం చెప్పను అంటూ తన ప్రెస్ మీట్ అక్కడితో ముగించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు రిపోర్టర్ల తీరుపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి ప్రశ్నలతో సెలబ్రిటీలను ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.

ఫ్యామిలీతో సంతోషంగా లోకేష్..

Advertisement

ఇక లోకేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన 2012 వ సంవత్సరంలో ఐశ్వర్య అనే అమ్మాయిని ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈయన తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎదురవడంతో ఈయన కూడా తనదైన స్టైల్ లోనే సమాధానం చెప్పారు.

Also Read: Mrunal Thakur: రొమాంటిక్ హీరోతో కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మృణాళ్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×