E-Paper
Advertisement

Best Sarpanch Award: జాతీయ స్థాయిలో మెరిసిన ఏపీ సర్పంచ్.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా రావిచెర్ల సర్పంచ్ కు అవార్డు! 

Best Sarpanch Award: జాతీయ స్థాయిలో మెరిసిన ఏపీ సర్పంచ్.. కేంద్ర మంత్రి చేతుల మీదుగా రావిచెర్ల సర్పంచ్ కు అవార్డు! 
Advertisement

Best Sarpanch Award: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అరుదైన గౌరవం దక్కింది. దేశవ్యాప్తంగా ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసిన కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ, ఏపీ నుంచి తొమ్మిది పంచాయతీలను విజేతలుగా ప్రకటించింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, రావిచెర్ల గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు జాతీయ స్థాయిలో ‘ఉత్తమ సర్పంచ్’ అవార్డుకు ఎంపికయ్యారు. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ఎస్పీ సింగ్ భగేల్ చేతులమీదుగా శ్రీనివాసరావు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకలకు కాపా శ్రీనివాసరావును కుటుంబ సమేతంగా ప్రత్యేక అతిథిగా ఆహ్వానించడం విశేషం. కర్తవ్య పథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌ను ఆయన తన కుటుంబంతో కలిసి వీక్షించారు. ఒక సామాన్య గ్రామ ప్రజాప్రతినిధికి దేశ రాజధానిలో ఇంతటి గౌరవం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అవార్డు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉత్తమ సర్పంచ్‌గా ఎంపికవ్వడం తన జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమని, తన గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ పురస్కారం అంకితమని భావోద్వేగానికి లోనయ్యారు.

Advertisement

ముఖ్యంగా ఈ విజయంలో తనకు అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు శ్రీనివాసరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన గ్రామ పంచాయతీ ప్రజల సహకారం వల్లే ఈ గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టి, రావిచెర్ల గ్రామ పంచాయతీని దేశంలోనే నంబర్ వన్ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన ఈ సందర్భంగా ప్రతినబూనారు.

Read Also: Markapuram: స్కూల్ ఆవరణలో శవం పాతిపెట్టిన వైసీపీ నేత.. స్థలం తనదేనంటూ వాదన

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×